BigTV English

Train Tickets: రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం బంద్.. అసలు విషయం చెప్పిన కేంద్రం!

Train Tickets: రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం బంద్.. అసలు విషయం చెప్పిన కేంద్రం!

Indian Railways: గత కొద్ది రోజులుగా రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. రైల్వే కౌంటర్లలో టికెట్లు అమ్మరంటూ కొన్ని యూట్యూబ్ చానెళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వార్తలను చూసి ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయడం రాని వాళ్లు టికెట్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తవం అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వెల్లడించింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈ విషయాన్ని వెల్లడించింది. రైల్వే ప్రయాణీకులు ఆ ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించింది.


నకిలీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో

రైల్వే కౌంటర్లలో టికెట్లు అమ్మడం లేదన్న వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కీలక ప్రకటన చేసింది. “కొన్ని యూట్యూబ్ చానెళ్లు అసత్య ప్రచారంతో ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. రైల్వే కౌంటర్లలో ఇకపై టికెట్లు అమ్మరని ప్రచారం చేస్తున్నాయి. ఈ వార్తలన్నీ అవాస్తవం. రైలు టికెట్లను స్టేషన్‌ లోని కౌంటర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చు” అని  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది.


సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రచారం

నిజానికి గత కొద్ది రోజులుగా రైల్వే కౌంటర్లలో టికెట్ల అమ్మకం నిలిపివేస్తున్నట్లు చిన్నా చితకా యూట్యూబ్ చానెళ్లు ప్రచారం మొదలు పెట్టాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలుపెట్టాయి. ఈ వార్తలను చూసి ప్రజలు, ప్రయాణీకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది.  రైలు టికెట్లు కౌంటర్లలో అమ్మడం మానేశారని వార్తలు పూర్తిగా అవాస్తవం అని ప్రకటించింది. యూట్యూబ్ లో బోగస్ థంబ్‌ నెయిల్స్ చూసి ఆందోళన చెందకూడదన్నారు అధికారులు. రైళ్లకు సంబంధించి, రైల్వే టికెట్ల జారీ గురించి ఏవైనా అనుమానాలు ఉంటే సమీపంలోని రైల్వే స్టేషన్లకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని  సూచించారు.

PIB ఫ్యాక్ట్ చెక్ గ్రూప్ ఏం చెప్పిందంటే?

“రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నియమం ప్రకారం, స్టేషన్ కౌంటర్లలో రైలు టికెట్ల జారీ నిలిపివేయబడింది. ఇప్పుడు అక్కడ  ప్రయాణీకులకు టికెట్లు లభించవు అని “a1studies1210”  అనే యూట్యూబ్ చానెల్ థంబ్‌ నెయిల్‌ లో చెప్పింది నిజం కాదు. ఇది నకిలీ వార్త. రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి ఆర్డర్ జారీ చేయలేదు. అన్ని రైల్వే స్టేషన్ల లో కౌంటర్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. http://irctc.co.in వెబ్‌ సైట్‌ లో ఇ-టికెట్ బుకింగ్  సౌకర్యం కూడా ఉంది. ఫేక్ వార్తలు చూసి ప్రయాణీకులు మోసపోకూడదని సూచిస్తున్నాం. రైల్వే అధికారికంగా చెప్పిన విషయాలను మాత్రమే నమ్మాలని సూచిస్తున్నాం” అని PIB ఫ్యాక్ట్ చెక్ గ్రూప్ వెల్లడించింది.

Read Also: రైలు ఎన్ని గంటలు ఆలస్యమైతే ఫుల్ రీఫండ్ ఇస్తారు? ఈ కొత్త రూల్ గురించి తెలుసా?

Related News

Indian Railways: నో వాటర్, దర్టీ టాయిలెట్స్, బాబోయ్ రైళ్లలో శుభ్రత ఇంత దారుణమా?

Indian Railways: రైలు ఎన్ని గంటలు ఆలస్యమైతే ఫుల్ రీఫండ్ ఇస్తారు? ఈ కొత్త రూల్ గురించి తెలుసా?

IRCTC Ticket Booking: ఫెస్టివల్ సీజన్ తో పోటెత్తిన బుకింగ్స్, IRCTC వెబ్‌ సైట్ క్రాష్!

Viral Video: హైదరాబాద్‌ను దుబాయ్‌తో పోల్చిన రష్యన్ బ్యూటీ.. వీడియో చూస్తే ఔరా అంటారు!

Nude Cruises: ఏవండోయ్ ఇది విన్నారా.. బట్టలు లేకుండా సముద్ర ప్రయాణం.. ఎక్కడో తెలుసా?

Big Stories

×