Indian Railways Refund Rules: షెడ్యూల్ కన్నా రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణీకులకు పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుందని భారతీయ రైల్వే సంస్థ వెల్లడించింది. అయితే, ఎన్ని గంటలు ఆలస్యం అయితే రీఫండ్ పొందవచ్చు అనే విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ రీఫండ్ రూల్స్ ఏం చెప్తున్నాయి? పూర్తి రీఫండ్ పొందేందుకు ఎన్ని రైలు ఎన్ని గంటలు ఆలస్యం కావాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
3 గంటలకు పైగా ఆలస్యమైతే పూర్తి రీఫండ్
ఒక రైలు నిర్ణీత షెడ్యూల్ కంటే 3 గంటలు, అంతకంటే ఎక్కువ ఆలస్యంగా నడిస్తే, ప్రయాణీకులు అవసరం అనుకుంటే పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఇ-టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు IRCTC వెబ్ సైట్, యాప్ ద్వారా టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. కౌంటర్ టికెట్లు ఉన్న ప్రయాణీకులు సమీపంలోని రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి రద్దు చేసుకోవచ్చు. ఈ నియమం అన్ని రైళ్లకు వర్తిస్తుంది.
చార్ట్ తయారీ తర్వాత TDR అవసరం
రైలు చార్ట్ తయారు చేయబడి తర్వాత ఒకవేళ ప్రయాణించకూడదని నిర్ణయించుకుంటే, TDR (టికెట్ డిపాజిట్ రసీదు) దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను IRCTC వెబ్ సైట్, యాప్ నుంచి కూడా పూర్తి చేయవచ్చు. TDR దాఖలు చేసేటప్పుడు, రైలు బయలుదేరే సమయానికి ముందు ఇవ్వాల్సి ఉంటుంది. దర్యాప్తు తర్వాత, రైల్వే రీఫండ్ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.
రైలు రద్దు అయినా పూర్తి రీఫండ్
ఒకవేళ ఏదైనా అనివార్య కారణంతో రైలు రద్దు అయితే, ప్రయాణీకుడికి ఎటువంటి తగ్గింపు లేకుండా పూర్తి ఛార్జీ తిరిగి ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ప్రయాణీకులు TDR దాఖలు చేయవలసిన అవసరం లేదు. రైల్వే స్టిస్టమ్ ఆటోమేటిక్ గా డబ్బును రీఫండ్ చేస్తుంది.
తత్కాల్ టికెట్ పైనా రీఫండ్ పొందే అవకాశం
నిజానికి తత్కాల్ టికెట్ పై వాపసు అందుబాటులో లేదని చాలా మంది నమ్ముతారు. కానీ, ఇందులో నిజం లేదు. రైలు 3 గంటలకు పైగా ఆలస్యమైతే, ప్రయాణం రద్దు చేయబడితే, తత్కాల్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు కూడా పూర్తి ఛార్జీని తిరిగి పొందవచ్చు.
రీఫండ్ పొందడానికి టైమ్ పీరియడ్
రీఫండ్ పొందడానికి కొంత టైమ్ బాండ్ విధించింది భారతీయ రైల్వే. రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే టికెట్ రద్దు చేసుకున్నా, రైలు బయలుదేరడానికి ముందు TDR దాఖలు చేసినా పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ రైల్లో ఏసీ పని చేయకపోతే రైలు గమ్యస్థానానికి చేరుకున్న 20 గంటలలోపు TDR దాఖలు చేసి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. రైలు రద్దు చేయబడితే షెడ్యూల్ సమయం నుండి 72 గంటలలోపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ప్రయాణీకులకు ఉపశమనం
రీఫండ్ రూల్స్ కారణంగా ప్రయాణికులు రైలు ఆలస్యమైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ట్రిప్ రద్దు చేయాల్సి వస్తే, ఎటువంటి నష్టం లేకుండా తమ డబ్బును తిరిగి పొందవచ్చు. పని కారణంగా, ఏదైనా ముఖ్యమైన కారణం వల్ల తమ ప్రయాణాన్ని మార్చుకోవాల్సిన ప్రయాణికులకు ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also: ఫెస్టివల్ సీజన్ తో పోటెత్తిన బుకింగ్స్, IRCTC వెబ్ సైట్ క్రాష్!