BigTV English
Advertisement

Viral Video: పట్టాలు తప్పి ఊళ్లోకి దూసుకెళ్లిన రైలు, జనం అంతా షాక్!

Viral Video: పట్టాలు తప్పి ఊళ్లోకి దూసుకెళ్లిన రైలు, జనం అంతా షాక్!

Goods Train Accident In Odisha: ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ లో ఎదురెదురుగా గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటన మర్చిపోక ముందే, ఒడిషాలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఏకంగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి సమీపంలోని ఊళ్లోకి దూసుకెళ్లింది. అత్యంత వేగంతో జనావాసాల్లోకి వెళ్లడంతో పలు ఇండ్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


ఊళ్లోకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు

ఒడిషాలోని రూర్కేలాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. సరుకులతో వెళ్తున్న ఈ రైలు  ఒక్కసారిగా పట్టాలు తప్పి జనావాసాల్లోకి దూసుకెళ్లింది. మూడు వ్యాగన్లు రైలు నుంచి విడిపోయాయి. రైలు వేగం ధాటికి బసంతి కాలనీలోని పలు ఇండ్లు కుప్పకూలాయి. పలు వాహనాలు తుక్కు తుక్కు అయ్యాయి. ఇండ్లు, గోడలు, రోడ్ల పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంతో రైలు వ్యాగన్లు ఓ స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టాయి. ఈ ప్రమాద సమయంలో అందులో పిలలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ, పెద్ద మొత్తంలో ఆస్తినష్టం వాటిల్లింది.


ఆస్తి నష్టాన్ని అంచనా వేసిన అధికారులు

అటు ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలను అంచనా వేస్తున్నారు. గూడ్స్ రైలు ఎలా పట్టాలు తప్పిందని విచారణ చేస్తున్నారు. త్వరలోనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. అటు ఈ ప్రమాదంలో ఊళ్లో జరిగిన ఆస్తి నష్టం పైగా ఆరా తీశారు. ధ్వంసమైన ఇండ్లు, వాహనాలతో పాటు ఇతర వస్తువుల వివరాలను సేకరించారు. ఈ వివరాలను పై అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో నష్టపోయిన గ్రామాస్తులందరికీ రైల్వేశాఖ తరఫున సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

Read Also:  రైల్వే ట్రాక్ మీదికి దూసుకొచ్చిన కారు, అదెలా సాధ్యం రా?

ఫతేపూర్ లో ఎదురు ఎదురుగా ఢీకొన్న గూడ్స్ రైళ్లు

నిన్న( ఫిబ్రవరి 4) ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఫతేపూర్ జిల్లాలోని పంభీపూర్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. కాన్పూర్- ఫతేపూర్ మధ్య ఖాగాలో ఓ గూడ్స్ రైలు పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో వేగంగా ఎదురుగా దూసుకొచ్చిన మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆగి ఉన్న రైలు కంపార్ట్‌ మెంట్లు పట్టాలు తప్పి చెల్లా చెదురుగా పక్కకు ఎగిరిపడ్డాయి. ఈ యాక్సిడెంట్ లో రెండు గూడ్స్ రైళ్లలోని లోకో పైలట్లు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. గాయపడిన లోకో పైలట్లను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సమన్వయ లోపమే కారణంగా కనిపిస్తుందని అధికారులు వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

Read Also: మహిళ రైల్వే ట్రాక్ దాటుతుంటగా దూసుకొచ్చిన రైలు.. ఒక్కసారిగా షాక్..

Related News

Karnataka Tour: కర్ణాటకలోని..ఈ ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Big Stories

×