GRP Police Viral Video: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో రైల్వే డివిజన్ లో షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) సిబ్బంది రాత్రిపూట రైలులో ఓ మహిళను అసభ్యంగా తాకుతూ అనుచితంగా ప్రవర్తించాడు. సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు పోలీస్.. ఆమహిళా ప్రయాణీకురాలికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. తన మీద ఫిర్యాదు చెయ్యొద్దని వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
రైల్వే ప్రయాణీకులు భద్రత కల్పించేందుకు రైల్వే సిబ్బంది రైళ్లలో పోలీసు భద్రత ఏర్పాటు చేస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రయాణీకులను కాపాడటమే వారి లక్ష్యం. ఇందుకోసం రైల్వే గవర్నమెంట్ పోలీస్ సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ప్రయాణీకుల భద్రత కాపాడాల్సిన రైల్వే పోలీసులే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రయాగ్ రాజ్ డివిజన్ పరిధిలో రైల్లో విధులు నిర్వహిస్తున్న ఆశిష్ గుప్తా అనే GRPలో కానిస్టేబుల్.. రాత్రిపూట ఓ మహిళను అసభ్యంగా తాకాడు. దీంతో సదరు మహిళ సీరియస్ అయ్యింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించింది. అయితే, సదరు రైల్వే పోలీస్ ఆ మహిళకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. తనను క్షమించాలని వేడుకున్నాడు. ఒకవేళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తన ఉద్యోగం పోతుందని వేడుకున్నాడు. ఆమె కాళ్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన సదరు పోలీసుపై ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయబడింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి GRP ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
A GRP jawan identified as Ashish Gupta seen profusely apologising here is accused of inappropriately touching a woman onboard a train in Prayagraj, Uttar Pradesh. GRP jawans are deployed on trains for protection and safety of passangers. pic.twitter.com/JsXYpvAjxT
— Piyush Rai (@Benarasiyaa) August 23, 2025
TTEతో GRP కానిస్టేబుల్ వాదన
అటు ఈ సంవత్సరం మార్చిలో, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) కానిస్టేబుల్, ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ (TTE) మధ్య గొడవ జరిగిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ సంఘటన మార్చి 10న న్యూఢిల్లీ-సొగారియా ఎక్స్ ప్రెస్ లో జరిగింది. ఇద్దరు అధికారుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. తన భార్యను స్లీపర్ టికెట్ పై ఏసీ కంపార్ట్ మెంట్ లో ప్రయాణించడానికి అనుమతించాలన్న పోలీసు అభ్యర్థనను టీటీఈ తిరస్కరించడంతో ఈ వాదన చెలరేగినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. సదరు పోలీసుపై చర్చలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు మరో పోలీస్ మహిళా ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సంచలనం కలిగించింది.
Read Also: రీల్ కోసం ఫ్లై ఓవర్ మీది నుంచి దూకిన యువకుడు.. కాళ్లు రెండూ…