సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువతీ యవకులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నదుల దగ్గర, లోయల దగ్గర, రైళ్లలో ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. అయినప్పటికీ చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేస్తూ కోరి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు.
రీల్స్ కోసం ప్లై ఓవర్ మీది నుంచి దూకిన యువకుడు
తాజాగా ఓ యువకు సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావాలనుకున్నాడు. క్రేజీ వీడియో చేసి ఫాలోవర్స్ ను పెద్ద సంఖ్యలో పెంచుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఓ రీల్ చేయాలనుకున్నాడు. ముందస్తుగా ఓ ప్లాన్ చేసుకున్నాడు. అతడు ఫ్లై ఓవర్ మీది నుంచి కిందికి దూకాలని, అదే సమయంలో ప్లైఓవర్ కింది నుంచి ఓ చెత్త ట్రక్ అక్కడికి రావాలి. అతడు నేరుగా ట్రక్ లో పడాలి. దెబ్బలు తగలకుండా ట్రక్ లో ఏర్పాట్లు కూడా చేశాడు.
చివరి క్షణంలో సీన్ రివర్స్..
ముందుగా అనుకున్నట్లుగానే సదరు యువకుడు ప్లై ఓవర్ ఎక్కాడు. ట్రక్ కూడా రావడం మొదలు పెట్టింది. పై నుంచి యువకుడు దూకేశాడు. కానీ, అతడు కిందికి వచ్చే లోగా ట్రక్ ముందుకు కదిలింది. నేరుగా వచ్చి రోడ్డు మీద పడ్డాడు. స్పాట్ లోనే కాళ్లు చేతులు విరిగిపోయాయి. నడుముకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. పడ్డ చోటు నుంచి కనీసం పక్కకు కదిలే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ దృశ్యాలను చూసి అక్కడే ఉన్న వాళ్లు షాకయ్యారు. వెంటనే దగ్గరికి వెళ్లి అతడిని పక్కకు మోసుకెళ్లారు. కాళ్లు, చేతులు విరిగిపోయినట్లు గుర్తించారు. ఇతర భాగాలకు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు.
ये साहब रील बनाने के लिए फ्लाईओवर पर चढ़े थे…
सोचे थे कि नीचे जैसे ही कचरे की गाड़ी सामने आएगी उसपर छलांग लगा देंगे और रील वायरल हो जाएगी।
कचरे वाली गाड़ी तो सामने आई पर कूदने में वो ही देर कर दिए और उनके जिदंगी का रेल बन गया😭
अब ये साहब आगे अपनी जिंदगी में कभी रील बनाना तो… pic.twitter.com/K1BXXHOrpU
— 𝕃𝕕𝕦𝕥𝕧𝕒 𝕂𝕟𝕚𝕘𝕙𝕥 𝕔𝕠𝕞𝕞𝕖𝕟𝕥𝕠𝕣𝕪 (@Ldphobiawatch) August 22, 2025
Read Also: బాత్రూమ్ లోకి తొంగి చూసిన పులి.. ఆ తర్వాత..
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇక ఫ్లై ఓవర్ మీది నుంచి దూకి సోషల్ మీడియాలో వైరల్ అవుదామనుకున్న యువకుడు, రోడ్డ మీద పడి కూడా వైరల్ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికి మాలిన రీల్స్ కోసం జీవితాన్ని పణంగా పెట్టాడంటూ మండిపడుతున్నారు. ఇలా వెధవలకు అలా జరగడమే మంచిదని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో? అంటూ మరికొంత మంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యువతీ యువకులు రీల్స్ కోసం పిచ్చి ప్రయత్నాలు చేయకూడదంటున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? అనే వివరాలు తెలియదు.
Read Also: నోరా ఫతేహిలా కనిపించాలంటూ భార్యను అలా చేసిన భర్త.. సీన్ కట్ చేస్తే..