BigTV English

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Bullet Train Bookings:

భారతీయ రైల్వే మరో కీలక ముందడుగు వేయబోతోంది. త్వరలోనూ ఇండియాలో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తొలిసారి ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ బుల్లెట్ రైలు విషయంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ ఉండదని వెల్లడించింది. మెట్రో రైలు మాదిరిగానే అప్పటికప్పుడు టికెట్లు తీసుకుని వెళ్లొచ్చని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతి 10 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉంటుందన్నారు. “బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రతి అరగంటకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. మొత్తం నెట్‌ వర్క్ ఓకే అయిన తర్వాత ప్రతి 10 నిమిషాలకు ఓ రైలు అందుబాటులోకి వస్తుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణించాలనుకుంటే, ముందస్తు రిజర్వేషన్ టికెట్లు అవసరం లేదు” అని వెల్లడించారు.


అచ్చం మెట్రో లాంటి ప్రయాణ అనుభవం

ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్ లో బుల్లెట్ రైళ్లల్లో అప్పటికప్పుడు టికెట్లు తీసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది. కేవలం రెండు గంటల్లో 508 కి.మీ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. ప్రతి పది నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉంటుంది.  బుల్లెట్ రైళ్లు, అచ్చం మెట్రో రైళ్ల మాదిరిగానే రాకపోకలు కొనసాగించనున్నాయి.

Read Also: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!


ముంబై-అహ్మదాబాద్ మెట్రో రైలు గురించి..

ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం థానేలో సొరంగ మార్గం నిర్మాణం కొనసాగుతుంది. ఈ సొరంగం 21 కి.మీ భూగర్భ మార్గంలో ఉంటుంది. దీని పని మే 2024లో ప్రారంభమైంది. జూలైలో  2.7 కి.మీ నిర్మించారు. మరో 7 కి.మీ అత్యంత సవాల్ తో కూడి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సొరంగం 13.1 మీటర్ల ఎత్తు, 12.6 మీటర్ల వెడల్పుతో కొనసాగుతోంది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అయిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ మొత్తం 508 కి.మీ పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇప్పటి వరకు 321 కి.మీ వయాడక్ట్, 398 కి.మీ పియర్లు, 17 నది వంతెనలు, 9 స్టీల్ వంతెనలు, 4 లక్షలకు నాయిస్ బారియర్స్ నిర్మాణం పూర్తయ్యింది. 206 కిలో మీటర్ల పరిధిలో ట్రాక్ బెడ్ నిర్మాణం పూర్తయ్యింది. మెయిన్‌ లైన్ వయాడక్ట్‌ లో 48 కి.మీ.లను కవర్ చేసేలా 2,000 కంటే ఎక్కువ ఓవర్‌ హెడ్ పరికరాల మాస్ట్ లను ఏర్పాటు చేశారు. 2030 వరకు ఈ రైల్వే ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియాలో సేవలు అందించనున్న బుల్లెట్ రైళ్లు జపాన్ లో ట్రయల్ రన్స్ కూడా పూర్తి చేసుకున్నాయి.

Read Also: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Related News

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Trains Derail: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Airways New Rule: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!

Dussehra – Diwali: పండుగ సీజన్ లో భారతీయులు వెళ్లాలనుకుంటున్న టాప్ ప్లేసెస్ ఇవే, మీరూ ట్రై చేయండి!

Big Stories

×