Paris in Hyderabad: ప్యారిస్ వెళ్లి ఐఫిల్ టవర్ చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ, అందరికీ ఆ అవకాశం దొరకదు. అలాంటి వారికి హైదరాబాద్ లోనే ప్యారిస్ ఎక్స్ పీరియెన్స్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ లో ‘పారిక్స్ క్రీమ్’ పేరుతో ప్యారిస్ థీమ్ తో కూడిన డెజర్ట్ డెస్టినేషన్ ప్రారంభమైంది. ఇక్కడ డెజర్ట్ లు తినడంతో పాటు ఐఫిల్ టవర్ లాంటి ప్రత్యేక నిర్మాణాన్ని కూడా చూడొచ్చు. అందుకే ఈ ప్రదేశం ఫుడ్ లవర్స్ తో పాటు ఫొటోలు, రీల్స్ చేసుకునే వారికి సూపర్ స్పాట్ గా మారిపోయింది.
పారిక్స్ క్రీమ్‌లో ప్రధాన ఆకర్షణ ‘ఐస్ క్రీమ్ టవర్’. ఇది సాధారణంగా దూరం నుంచి చూసి ఫొటో దిగే నిర్మాణం మాత్రమే కాదు. సందర్శకులు టవర్ పైభాగానికి వెళ్లి అక్కడ కూర్చునే అవకాశం కూడా ఉంది. అక్కడ కూర్చొని తమకు నచ్చిన డెజర్ట్ ను ఆస్వాదిస్తూ చుట్టుపక్కల అడ్వెంచర్ పార్క్ దృశ్యాలను చూడొచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది. చీకటిపడ్డాక టవర్ లైట్లను ఆన్ చేస్తారు. పగటితో పోలిస్తే రాత్రి సమయంలో ఈ ప్రదేశం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. లైటింగ్‌తో పాటు ప్రత్యేక సందర్భాల్లో లైట్ షోలు, క్రాకర్స్ కూడా కాల్చుతారు. అందుకే ఇక్కడికి వచ్చే చాలామంది డెజర్ట్ తినడంతో పాటు ఫొటోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
పారిక్స్ క్రీమ్‌లో సాధారణ ఐస్ క్రీమ్, షేక్‌లతో పాటు కొన్ని ప్రత్యేకమైన డెజర్ట్ లు కూడా ఉన్నాయి. అందులో కోన్‌లో అందించే కేక్ ఒకటి. ఇది చూడటానికి కూడా కొత్తగా ఉండటంతో పిల్లలు, యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది. టెడ్డీ బేర్ థీమ్‌తో అందించే షేక్‌లు కూడా మెనూలో ఉన్నాయి. కొన్ని షేక్‌లతో పాటు చిన్న టెడ్డీ బేర్‌ను కూడా అందిస్తారు. ఐస్ క్రీమ్, షేక్‌లలో వివిధ రకాల ఫ్లేవర్లను ఎంచుకోవచ్చు. ఇక్కడ ధరలు డెజర్ట్‌ను బట్టి మారుతాయి. సాధారణంగా రూ.99 నుంచి ప్రారంభమై సుమారు రూ.300 వరకు ఉంటాయి. పెద్ద బడ్జెట్ లేకుండానే చక్కటి అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది.
పారిక్స్ క్రీమ్‌లో మరో ఆసక్తికరమైన సదుపాయం టవర్ పైభాగంలో ఉండే ప్రైవేట్ సీటింగ్. జంటలు ప్రశాంతంగా కూర్చొని డెజర్ట్ తింటూ పరిసరాలను ఆస్వాదించేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రైవేట్ సీటింగ్ కోసం ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం సమయంలో ఇక్కడ కూర్చొని లైట్లను చూస్తూ సమయం గడపడం మంచి డేట్ ఐడియాగా భావిస్తున్నారు. పారిక్స్ క్రీమ్ ప్రత్యేకంగా నిలవడానికి మరో కారణం ఇది ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ లో ఉండటం. అంటే కేవలం ఐస్ క్రీమ్ తిని వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ముందుగా అడ్వెంచర్ పార్క్ లోని అన్నింటిని ఆస్వాదించి, చివర్లో డెజర్ట్ తో రోజును ముగించవచ్చు.ప్యారిస్ వెళ్లే ప్లాన్ లేకపోయినా, ఐఫిల్ టవర్ తరహా బ్యాక్‌డ్రాప్‌తో ఫొటోలు దిగుతూ డెజర్ట్ లను ఆస్వాదించాలనుకునే వారికి హైదరాబాద్‌లోని ఈ కొత్త ప్రదేశం ఆసక్తికరమైన వీకెండ్ స్పాట్‌గా మారుతోంది.
Read Also: పుతిన్ కోసం రహస్య రైలు.. ప్రెసిడెంట్ ను కనిపెట్టడం అంత ఈజీ కాదా?