Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులు చేర్పులు చేస్తున్నది. తాజాగా తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ కు సంబంధించి కీలక మార్పులు చేసింది. కొత్త మార్పుల ప్రకారం, కొన్ని కేటగిరీలలో తత్కాల్ టికెట్ల చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ ఏసీ క్లాస్ కు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుండగా.. స్లీపర్ క్లాస్ కు ఉదయం 11 గంటలకు నుంచి బుకింగ్ మొదలవుతుంది. ఆధార్ లింక్ చేసిన వినియోగదారులు ఒక నెలలో ఒక్కో ID నుంచి గరిష్టం 12 టికెట్లు, 6 తత్కాల్ టికెట్లు పొందే అవకాశం ఉంది. రీఫండ్ కు సంబంధించి కూడా కొన్ని నిబంధనలను మార్చింది.
కొత్తగా తీసుకొచ్చిన రీఫండ్ నిబంధనలు
తత్కాల్ టికెట్లకు సంబంధించిన కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణీకుల వివరాలను 25 సెకెన్లలో ఫిల్ చేయాలి. క్యాప్చా నింపడానికి 5 సెకెన్లు, ఓటీపీతో సహా పేమెంట్స్ కు మరో 10 సెకెన్ల సమయం కేటాయించారు. మొత్తంగా టికెట్ బుకింగ్ కు 40 సెకెన్ల సమయాన్ని కేటాయించారు. గతంలో తత్కాల్ టికెట్ బుకింగ్ లో రీఫండ్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు కొన్ని సమయాల్లో రీఫండ్ పొందే అవకాశం కల్పిస్తున్నారు. రైలు రద్దైనా, రైలు ఆలస్యంగా నడుస్తున్నా పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. తత్కాట్ టికెట్లను క్యాన్సిల్ చేసే అవకాశం మాత్రం ఉండదు. తత్కాల్ టికెట్లకు సంబంధించిన చార్జీలు కొంత మేర పెంచారు. జనరల్ క్లాస్ కు 10 శాతం, ఏసీ-3 టైర్ క్లాస్‌కు 15 శాతం, ఏసీ-2 టైర్‌కు 20 శాతం, ఏసీ-1 టైర్ క్లాస్‌కు 30 శాతం అధికంగా ఛార్జ్ వసూళు చేస్తున్నారు.
తత్కాల్ టికెట్ అంటే ఏంటి?
అత్యవసరంగా ప్రయాణం చేసే వారి కోసం అందించే టికెట్లను తత్కాల్ టికెట్లు అంటారు. ఈ టికెట్లు రైలు ప్రయాణానికి ఒక్కరోజు ముందుకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.
Read Also: టికెట్ తీసుకోకున్నా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు! రైల్వే కొత్త రూల్ గురించి మీకు తెలుసా?
ఒకే PNR నంబర్ పై ఆరుగురు ప్రయాణం
అటు భారతీయ రైల్వే సంస్థ ఒకే PNR నంబర్ మీద ఆరుగురు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. ఆ ఆరుగురు ప్రయాణీకులలో కొందరికి టిక్కెట్లు కన్ఫర్మ్ అయినా, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మిగిలిన వారికి కూడా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నది. అయితే, వారికి సీటు దొరురుకుతుందనే గ్యారెంటీ లేదు. టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్లు ఎవరైనా ప్రయాణించకపోతే, టీసీని అడిగి వారి ప్లేస్ లో కూర్చోవచ్చు. లేదంటే నిలబడి వెళ్లాల్సి ఉంటుంది.
Read Also: మీరు వెళ్లాల్సిన రైలు మిస్సయ్యిందా? అదే టికెట్ తో మరో రైల్లో వెళ్లొచ్చు! ఎలాగో తెలుసా?