Indian Railways Full Refund: ప్రతి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలల్లో ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోతాయి. ఉత్తరభారత దేశం అంతా పొగమంచులో మునిగిపోతుంది. దట్టమైన పొగ మంచు రైళ్లు, విమాన సేవల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. పలు రైళ్లు, విమానాలు ఆలస్యం కావడంతో పాటు రద్దు అవుతాయి. అయితే, మీరు ప్రయాణం చేయాల్సిన రైళ్లు ఎక్కువ ఆలస్యం అయినా, రద్దు అయినా, పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, టిక్కెట్ అమౌంట్ ను ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు? TDRని ఎలా ఫైల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలస్యమైనా, క్యాన్సిల్ అయినా పూర్తి రీఫండ్
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, మీరు ప్రయాణించాల్సిన రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణీకులు పూర్తి డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ తత్కాల్ టికెట్ కన్ఫామ్ అయ్యాక, రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. రీఫండ్‌ను క్లెయిమ్ చేయడానికి ప్రయాణీకులు టికెట్ డిపాజిట్ రిసీట్(TDR)ని ఫైల్ చేయాల్సి ఉంటుంది.
Read Also: రైలు సైడ్ లోయర్ బెర్త్ లో ఆ వైపు తిరిగి పడుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారు!
TDRని ఎలా ఫైల్ చేయాలంటే?
రైళ్ల ఆలస్యం అయినా, రద్దు అయినా రీఫండ్ క్లెయిమ్ చేయడానికి.. ప్రయాణీకులు టికెట్ డిపాజిట్ రిసీట్ ను (TDR) ఫైల్ చేయాలి. భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ ను లో TDRని ఫైల్ చేయవచ్చు. అంతేకాదు, ప్రయాణీకులు తమ టిక్కెట్లను రైల్వే స్టేషన్‌లలోని టికెట్ కౌంటర్‌లో సరెండర్ చేసిన తర్వాత కూడా పూర్తి వాపసును పొందే అవకాశం ఉంటుంది. ఈ డబ్బులు మీ అకౌంట్ లో క్రెడిట్ కావడానికి సుమారు 90 రోజులు పడుతుంది. TDRని ఇలా ఫైల్ చేయడండి.
❂ భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ IRCTCని ఓపెన్ చేయాలి.
❂ వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత, ‘సర్వీసెస్’ ట్యాబ్‌లో ‘File Ticket Deposit Receipt (TDR) ఆప్షన్ ను ఎంచుకోండి.
❂ ‘My Transactions’లోకి వెళ్లి ‘ఫైల్ TDR’పై క్లిక్ చేయాలి.
❂ ఫైలింగ్ పూర్తయిన తర్వాత, క్లెయిమ్ రిక్వెస్ట్ భారతీయ రైల్వేలకు పంపబడుతుంది.
❂ రైల్వే సంస్థ ఆమోదించిన తర్వాత, టిక్కెట్ బుకింగ్ చేసిన అదే బ్యాంకు ఖాతాలో రీఫండ్ మొత్తం జమ చేయబడుతుంది.
ఉత్తరాదిన దట్టమైన పొగమంచు.. IMD హెచ్చరికలు
ఉత్తరాదిలో అప్పుడే పొగమంచు కమ్ముకుంటున్నట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. తాజాగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 17 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉన్నట్లు తెలిపింది. చలిగాలులు వీచే అవకాశం లేదని, దట్టమైన పొగమంచు మరో రెండు నుంచి నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా IMD ఈ వీకెండ్ లో ఎల్లో జారీ చేసింది. రైల్వే ప్రయాణాల విషయంలో లోకో పైలెట్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది.