Indian Railway Train Ticket Booking Rules: భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణం చేయాలనుకునే వాళ్లు రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు సైతం రైళ్లలో వెళ్లేందుకు మొగ్గుచూపుతారు. చాలా మంది ప్రయాణానికి ముందే టికెట్లను బుక్ చేసుకుంటారు. తమతో పాటు ప్రయాణించే బంధుమిత్రులతో పాటు తెలిసిన వారికి సైతం టికెట్ బుక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులకు టికెట్లు బుక్ చేస్తే నేరంగా పరిగణిస్తామని వెల్లడించింది. జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది.
టికెట్ రిజర్వేషన్ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం..
టికెట్లను బుక్ చేస్తే జైలు శిక్ష, జరిమానా విధించడం ఏంటని చాలా మందిలో ఆలోచని రావచ్చు. అయితే కుటుంబ సభ్యులకు టికెట్లు బుక్ చేయడంలో ఎలాంటి తప్పులేదని చెప్పిన రైల్వేశాఖ, తెలియని వ్యక్తులకు టికెట్లు బుక్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వెల్లడించింది. ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులకు టికెట్లు బుక్ చేసినట్లు తెలిస్తే, జైలు శిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రైల్వేశాఖ కొత్త టికెట్ బుకింగ్ రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడంతోపాటు పారదర్శకత కోసమే ఈ రూల్స్ ఫ్రేమ్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
మూడేళ్లు జైలు, రూ. 10 వేలు జరిమానా
రైల్వే చట్టం 1989 సెక్షన్ 143 ప్రకారం పరిమితికి మించి టికెట్లు బుక్ చేయాలంటే రైల్వేశాఖ గుర్తింపు కలిగిన ఏజెంట్లు అయి ఉండాలి. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఒకవేళ తాజా టికెట్ బుకింగ్ రూల్స్ ను అతిక్రమిస్తే సుమారు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రూ. 10 వేల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
Read Also: మన వందేభారత్ కు మరిన్ని కోచ్ లు, ప్రయాణీకులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్!
టికెట్ బుకింగ్స్ కు సంబంధించి రైల్వే నిబంధనలు ఏం చెప్తున్నాయంటే?
తాజాగా తీసుకొచ్చిన రైల్వే నిబంధనల ప్రకారం IRCTC వ్యక్తిగత ఐడీతో కేవలం బంధువులకు, లేదంటే ఒకే ఇంటిపేరు ఉన్న వ్యక్తులకు మాత్రమే టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ తో లింక్ చేసుకున్న వినియోగదారులు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ లింక్ లేని వినియోగదారులు నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ టికెట్లు కూడా యూజర్ తో పాటు కుంటుంబ సభ్యులకు మాత్రమే బుక్ చేయాల్సి ఉంటుంది. మిత్రులకు, ఇతర బంధువులకు టికెట్లు బుక్ చేయడం వల్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.
Read Also: ఇకపై 90 రోజుల్లో చలాన్ చెల్లించాల్సిందే.. లేదంటే మీ వెహికల్ గోవిందా!