Indian Railways: దేశ వ్యాప్తంగా మౌలిక వసతులను ఆధునికీకరిస్తోంది భారతీయ రైల్వే. ఇంటర్ లాకింగ్ సహా ఇతర సేఫ్టీ వ్యవస్థలను ఇన్ స్టాల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 26 వరకు జార్ఖండ్ కు వచ్చి వెళ్లే 29 రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా ఆద్రా, చక్రధర్ పూర్ మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ, సిగ్నలింగ్ వ్యవస్థను అప్ డేట్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్ల క్యాన్సిలేషన్ కొద్ది రోజులే అయినప్పటికీ జార్ఖండ్ తో పాటు పొరుగు రాష్ట్రాలలోని కీలక మార్గాల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులపై ప్రభావం పడుతోంది. “ఆద్రా, చక్రధర్ పూర్ డివిజన్లలో ట్రాక్ పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్ డేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశాం” అని రైల్వే అధికారులు తెలిపారు.
క్యాన్సిల్ అయిన రైళ్ల వివరాలు
రద్దు చేసిన రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లలో ప్రయాణం చేయాలనుకున్న ప్యాసింజర్లు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.
⦿ రైలు నంబర్ 68044: రూర్కెలా–టాటా మెము – ఏప్రిల్ 21 నుంచి 26 వరకు క్యాన్సిల్ చేయబడింది.
⦿ రైలు నంబర్ 68043: టాటానగర్–రూర్కెలా మెము – ఏప్రిల్ 21 నుంచి 25 వరకు రద్దు చేయబడింది.
⦿ రైలు నంబర్లు 68030/68029: రూర్కెలా–జార్సుగూడ–రూర్కెలా మెము – ఏప్రిల్ 21 నుంచి 26 వరకు రద్దు చేయబడింది.
⦿ రైలు నంబర్లు 68026/68025: రూర్కెలా–చక్రధర్ పూర్–రూర్కెలా మెము – ఏప్రిల్ 21 నుంచి 26 వరకు రద్దు చేయబడింది.
⦿ రైలు నంబర్లు 18113/18114: టాటా–బిలాస్‌పూర్–టాటా ఎక్స్ ప్రెస్ – ఏప్రిల్ 24 నుంచి 26 వరకు రద్దు చేయబడింది.
⦿ రైలు నంబర్లు 18109/18110: టాటానగర్–ఇత్వారీ ఎక్స్ ప్రెస్ – ఏప్రిల్ 25, 26 తేదీలలో రద్దు చేయబడింది.
⦿ రైలు నంబర్ 58659: హటియా–రూర్కెలా ప్యాసింజర్ – ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రద్దు చేయబడింది.
⦿ రైలు నంబర్ 58660: రూర్కెలా–హటియా ప్యాసింజర్ – ఏప్రిల్ 21 నుంచి 27 వరకు రద్దు చేయబడింది
అటు కాంటబంజి/టిట్లాగఢ్–హౌరా ఇస్పాత్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 22862/12872) ఏప్రిల్ 21 నుంచి 26 వరకు పూర్తి రూట్ కాకుండా కేవలం జార్సుగూడ వరకే ప్రయాణించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: లోకో పైలెట్ సాలరీ IAS ఆఫీసర్స్ కంటే ఎక్కువా? ఇదీ అసలు కథ!
ప్రయాణీకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
రైల్వేశాఖ తాజా నిర్ణయంతో ప్రయాణీకులు IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్ లేదంటే సమీపంలోని రైల్వే స్టేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రద్దు చేయబడిన రైళ్లకు సంబంధించిన ప్రయాణీకులకు టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని వెల్లడించారు. తాజా పనుల నేపథ్యంలో తాత్కాలిక ఇబ్బందులు కలిగినప్పటికీ మెరుగైన సమయపాలన, భద్రత, సులభంగా ప్రయాణం చేసే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
Read Also: హైదరాబాద్ – ముంబై హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ కీలక ముందడుగు.. ఇక అదొక్కటే మిగిలింది!