Indian Railwyas: భారతీయ రైల్వే ద్వారా రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరలో ఆహ్లాదకరంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణీకుల కోసం ప్రతి కోచ్ లో అవసరమైన టాయిలెట్లు ఉంటాయి. అయితే, రైలు నడిపే లోకో పైలెట్లకు ఇంజిన్ లో టాయిలెట్స్ ఉండవు. వాళ్లు రైలు ఆపినప్పుడు రైల్వే స్టేషన్ వాష్ రూమ్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే, చాలా కాలంగా ఇంజిన్ లో టాయిలెట్ ఏర్పాటు చేయాలని లోకో పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆపరేషన్ పరంగా సాధ్యం కాదని రైల్వే బోర్డు నిర్ణయించింది. అయినప్పటికీ, టాయిలెట్స్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
833 లోకో మోటివ్స్ లో టాయిలెట్ల ఏర్పాటు
లోకో పైలెట్ల ఇబ్బందులను తీర్చడంలో భాగంగా ఇప్పటికే 883 లోకో మోటివ్స్ లో టాయిలెట్లను అమర్చినట్లు రైల్వే సంస్థ వెల్లడించింది. “2014కి ముందు ఏ లోకోమోటివ్ లోనూ టాయిలెట్స్ సౌకర్యం లేదు. 2018 నుంచి సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు. లోకోమోటివ్ లలో నీరు లేని మూత్ర విసర్జన సౌకర్యాలను అందించడానికి చొరవ తీసుకోబడింది. 883 లోకోమోటివ్ లకు వీటిని అమర్చారు. అటు 7,075 లోకోమోటివ్ లకు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు అమర్చబడ్డాయి. తాజాగా తయారు చేయబడుతున్న అన్ని కొత్త లోకోమోటివ్‌లలో టాయిలెట్లను అమర్చుతున్నారు. పాత లోకోమోటివ్ లలోనూ టాయిలెట్లను అమర్చుతున్నారు. ఈ సదుపాయాన్ని కల్పించేందుకు పాత లోకోమోటివ్‌లలో డిజైన్ మార్పులు చేస్తున్నారు” అని రైల్వేశాఖ వెల్లడించింది.
సుమారు 15 వేల ఫంక్షనల్ లోకో మోటివ్‌లు
ప్రస్తుతం చాలా మంది లోకో పైలెట్లు రైల్వే స్టేషన్లలోని టాయిలెట్స్ ఉపయోగించుకుంటున్నారు. ప్రతి రైల్లో ఒక లోకో పైలెట్, ఓ అసిస్టెంట్ లోకో పైలెట్ ఉంటాడు. ప్రస్తుతం తయారు అవుతున్న లోకోమోటివ్ లలో ఉదాహారణకు వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లలో టాయిలెట్లు ఉంటాయి. పాత లోకోలకు టాయిలెట్లు లేవు. వాళ్లు రైల్వే స్టేషన్లలోని టాయిలెట్స్ ఉపయోగిస్తున్నారు. రైలు స్టేషన్ లో ఆగినప్పుడు సిబ్బంది టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇకపై లోకో పైలెట్లకు ఇబ్బంది కలగకుండా అన్ని లోకో మోటివ్స్ లో టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల లోకో పైలెట్స్ టాయిలెట్స్ కు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
Read Also: రైల్వే స్టేషన్ లో బస్తాల కొద్దీ కప్పలు.. ఓపెన్ చేసి చూసి రైల్వే పోలీసుల షాక్!
లోకో పైలెట్ల పని గంటలు తగ్గింపు
గతంలో లోకో పైలెట్లు సుమారు 10 గంటలు డ్యూటీ చేసే వాళ్లు. 2016లో హై-పవర్ కమిటీ సిఫార్సుల ఆధారంగా, లోకో పైలట్ల డ్యూటీ గంటలను 10 గంటల నుంచి తొమ్మిది గంటలకు తగ్గించింది. నిజానికి వాళ్లు 7 గంటలే డ్యూటీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటు 2014-15 నుంచి 2024-25 మధ్య 64,007 మంది అసిస్టెంట్ లోకో పైలెట్లను రిక్రూట్ చేసుకున్నారు. అదే సమయంలో 15,300 మంది పదవీ విరమణ చేశారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: 4 రోజులు.. 9 రాష్ట్రాలు…దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా?