Railway Modernization: భారతీయ రైల్వేను విదేశీ వ్యవస్థలతో సమానంగా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే నియంత్రణ వ్యవస్థను పూర్తి స్థాయిలో మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత 100 సంవత్సరాల పురాతన రైల్వే నియంత్రణ వ్యవస్థకు ఆధునిక హంగులు అద్దే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ అయిన ఇండియన్ రైల్వేకు సంబంధించిన ఆపరేషన్, భద్రతా స్థాయిని ప్రపంచ ప్రమాణాలకు సమానంగా తీసుకురానుంది. అందులో భాగంగా తీసుకొచ్చే మార్పులు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ రైల్వే నియంత్రణ వ్యవస్థ అప్ డేట్
భారతీయ రైల్వే ప్రస్తుతం 100 సంవత్సరాల పురాతన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంది. దానిని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధునీకరించబోతోంది. దీని ద్వారా కార్యకలాపాలు, భద్రతను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేయనుంది. రైల్వే బోర్డు కొత్త టెక్నాలజీ ఆధారిత నియంత్రణ వ్యవస్థ కోసం బ్లూప్రింట్ రెడీ చేస్తోంది. ఇది రైల్వే కార్యకలాపాలను, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడనుంది.
⦿ అత్యవసర మార్పులు
భారతీయ రైల్వేలో నిరంతరం పెరుగుతున్న రద్దీ, రైళ్ల ఆలస్యం, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నారు. ఈ కొత్త వ్యవస్థ అన్ని సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది.
⦿ విదేశీ వ్యవస్థల మాదిరిగా..
భారతీయ రైల్వే జపాన్, రష్యా, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలలో ఉపయోగిస్తున్న వ్యవస్థలను స్వదేశీ టెక్నాలజీతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే విదేశీ వ్యవస్థల నుంచి ప్రేరణ పొందిన స్వదేశీ వ్యవస్థను రూపొందించబోతోంది.
⦿ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్
సరికొత్త నియంత్రణ వ్యవస్థ కోసం ఇంట్రిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను నిర్మించాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. ఇక్కడ అన్ని విభాగాలు కలిసి రైళ్ల వేగం, రూట్ ప్లానింగ్, సంక్షోభ నిర్వహణను కంట్రోల్ చేయనుంది.
⦿సరకు రవాణా కారిడార్లు, హై-స్పీడ్ మార్గాలు
కొత్త వ్యవస్థ ముఖ్యంగా సరుకు రవాణా కారిడార్లు, హై-స్పీడ్ లాంటి మిశ్రమ ట్రాఫిక్ మార్గాలపై దృష్టి పెడుతుంది.
⦿ పూర్తి స్థాయి సాంకేతికత ఆధారిత వ్యవస్థ
రైల్వేలో ఇప్పటి వరకు ఆపరేషన్ ప్రధానంగా మాన్యువల్, డిపార్ట్‌మెంటల్ గా విభజించబడింది. కొత్త వ్యవస్థ ద్వారా రైల్వే కంట్రోలర్లపై ఒత్తిడి తగ్గుతుంది. ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుంది.
⦿ ట్రాఫిక్ నియంత్రణ విభాగం కంట్రోల్
నిజానికి రైల్వేలో ట్రాఫిక్ నియంత్రణ విభాగం ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడింది. శిక్ష లేని ఉద్యోగులను అక్కడ నియమించడం పట్ల నియంత్రణ సరిగా లేదు. ఇకపై పూర్తిగా టెక్నాలజీ వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్లక్ష్యం అనేది ఉండదు.
మొత్తంగా భారతీయ రైల్వేలో రాబోతున్న అత్యాధునిక రైల్వే కంట్రోల్ వ్యవస్థ రైల్వే కార్యలాపాలను మరింత సమర్థవంతంగా నడిపించనుంది. ప్రమాదాలు లేని ప్రయాణాన్ని అందించనుంది.