Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వేలోకి వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, సరికొత్త ఫీచర్లతో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించబోఉన్నాయి. ఇక వందేభారత్ స్లీపర్ రైలులో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇంటర్లేస్డ్ కాయిల్ డిజైన్ పాక్షికంగా రైల్వే వ్యవస్థ పని చేయకపోయినా కంటిన్యూయస్ ఏసీని అందిస్తుంది. ప్రయాణీకులకు స్థిరమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెయింటెయిన్ చేస్తోంది. రైల్లో ఒక పార్ట్ విఫలమైనప్పుడు అన్ని వ్యవవస్థలు పూర్తి షట్ డౌన్ అయ్యేలా కాకుండా, ఇంటర్లేస్డ్ కాన్ఫిగరేషన్ రిడెండెన్సీ కలిగి ఉంటుంది. ఈ కారణంగా కోచ్ లో ఏసీ అనేది అలాగే కంటిన్యూ అవుతోంది. కోచ్ లలో లైట్లు కూడా వెలుగుతూనే ఉంటాయి. ఇంటర్లేస్డ్ సిస్టమ్ లో మెరుగైన కాయిల్ వినియోగం మెరుగైన పార్ట్-లోడ్ సామర్థ్యం కారణంగా పవర్ ను సేవ్ చేస్తోంది. 2030 నాటికి జీరో పర్సెంట్ కర్బన ఉద్గారాలే టార్గెట్ గా ఈ రైళ్లు తమ సేవలను అందించనున్నాయి.
వందే భారత్ రైళ్ల ట్రయల్ రన్స్ సక్సెస్
వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరిలో రీసెర్చ్ డిజైన్స్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ఝాన్సీ డివిజన్, కోటా డివిజన్ తో పాటు అహ్మదాబాద్-ముంబై కారిడార్ తో సహా పలు మార్గాల్లో విస్తృతమైన ట్రయల్ రన్స్ నిర్వహించారు. 28 రోజులకు పైగా జరిగిన ఈ ట్రయల్స్, రైళ్ల పనితీరు, భద్రత, సౌకర్యాల స్థాయిలను అంచనా వేసింది. ట్రయల్స్ లో 180 కి.మీ./గం వేగాన్ని సాధించాయి. సుదూర మార్గాల్లో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి. 16 కోచ్ కాన్ఫిగరేషన్ లో AC-3, AC-2, ఫస్ట్ AC కోచ్‌లు ఉన్నాయి. వీటిలో అధునాతన లక్షణాలు, భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఏడది చివరి నాటికి అందుబాటులోకి 10 స్లీపర్ రైళ్లు
ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు భారతీయ రైల్వే డిసెంబర్ 2025 నాటికి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాని భావిస్తోంది. 24-కార్ల కాన్ఫిగరేషన్ గల రైళ్లు 2026-27 వరకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లు దేశ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
విమానం తరహా సౌకర్యాలు
వందేభారత్ స్లీపర్ రైల్లో విమానం తరహా సౌకర్యాలు ఉంటాయి. ఒకేసారి 823 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందులో 1 ఫస్ట్ ఏసీ కోచ్, 4 సెకండ్ ఏసీ కోచ్ లు, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఇక ఈ రైల్లో ప్రత్యేకమైన ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఉంటుంది. ప్రతి బెర్త్ దగ్గర ఎమర్జెన్సీ స్టాప్ బటన్స్ ఉంటాయి. ప్రయాణీకులు అత్యంత విలాసవంతంగా ప్రయాణించేలా బెర్తులను మెరుగైన కుషన్ తో రూపొందించారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ రైళ్లలో బయో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. బటన్ నొక్కకుండానే నీళ్లు వచ్చేస్తాయి. టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, హాట్ వాటర్ షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఒక కోచ్ లో నుంచి మరో కోచ్ లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్లతో పాటు ప్రయాణీకులకు వెచ్చదనాన్ని ఇచ్చేలా కోచ్ హీటర్లు, చల్లదనం కోసం ఏసీలు ఉంటాయి. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ఉంటుంది.
Read Also: అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ బుల్లెట్ రైలు లేదు, కారణం ఏంటో తెలుసా?