భారతీయ రైల్వే సంస్థ రోజు రోజుకు మరింత అప్ గ్రేడ్ అవుతోంది. సరికొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రైల్వే లైన్లను అప్ గ్రేడ్ చేస్తున్నది. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. భద్రత కోసం ‘కవచ్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక రైళ్లు అత్యధిక వేగంతో ప్రయాణించేలా రైల్వే ట్రాక్ లను అప్ గ్రేడ్ చేస్తున్నాయి. హైస్పీడ్ కార్యకలాపాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దుతున్నాయి. స్థిరత్వం, మన్నికతో కూడి ఉండేలా ట్రాక్‌లను బలోపేతం చేస్తున్నది. రైల్వే ట్రాక్స్ అప్ గ్రేడ్ ద్వారా ప్రయాణీకులు, సరుకు రవాణా సేవలు మరింత వేగంగా కొనసాగనున్నాయి. సురక్షితమైన, మరింత సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ ను పెంపొందించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు ముందుకు సాగుతున్నాయి.
రైళ్లు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించేలా..
ఇక భారతీయ రైల్వే సంస్థ గంటకు 130 కి.మీ వేగంగా ప్రయాణించేలా ఇప్పటి వరకు 23,000 కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్ లను అప్ గ్రేడ్ చేసింది. అటు గంటకు 110 కి. మీ వేగాన్ని అందించేలా సుమారు 54, 337 కిలో మీటర్ల రైల్వే లైన్ అప్ గ్రేడ్ అయ్యింది. మరికొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లను సెమీ హైస్పీడ్ రైళ్లు, ప్రయాణించేలా అప్ గ్రేడ్ చేస్తున్నారు. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేలా రైల్వే ట్రాక్ లను మెరుగు పరచనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.
సెమీ హైస్పీడ్ రైళ్లు నడిచే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
ప్రస్తుతం భారతీయ రైల్వేలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇవి గంటకు 160 కి. మీ వేగంతో ప్రయాణించే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. రైల్వే ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే సంస్థ హై స్పీడ్ ట్రాక్ సెక్టర్లలో భద్రత కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నది. ఈ చర్యలు రైళ్ల సజావుగా నడపడానికి మాత్రమే కాకుండా ప్రమాదాలను తగ్గించనున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే, ప్రత్యేక రైలు సేవలు 54 శాతం పెరిగాయి. ఏడాది కాలంలో ఏకంగా 57,169 ప్రత్యేక సర్వీసులను నడిపించింది భారతీయ రైల్వే.
Read Also: ఇండియన్ రైల్వే సూపర్ యాప్ వచ్చేసింది, కానీ.. అందరికీ కాదండోయ్!
త్వరలో అందుబాటులోకి వందేభారత్ స్లీపర్ రైళ్లు
ఇక భారతీయ రైల్వే సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఇప్పటికే వందేభారత్, నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. అటు హైడ్రోజన్ రైళ్లతో పాటు దేశీ బుల్లెట్ రైళ్లను రూపొందిచబోతున్నారు. భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ గ్రేడ్ అవుతూ ప్రజలకు మరిన్ని సేవలను అందించబోతున్నది.
Read Also: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే ఇక చుక్కలే, రైల్వే కీలక నిర్ణయం!
Read Also: రైల్వేకు ఝలక్.. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలంటూ ప్రయాణీకుడు డిమాండ్!