BigTV English

Indians Denied: భారతీయులకు నో ఎంట్రీ.. 10 మందిని వెనక్కి పంపిన మలేషియా, ఎందుకంటే?

Indians Denied: భారతీయులకు నో ఎంట్రీ.. 10 మందిని వెనక్కి పంపిన మలేషియా, ఎందుకంటే?

భారతీయులు ఎలాంటి వీసా లేకుండా మలేషియాలో పర్యటించే అవకాశం ఉన్నప్పటికీ తాజాగా, 10 మంది భారతీయలను తమ దేశంలోకి అనుమతించలేదు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు. మొత్తం 400 మంది విదేశీ ప్రయాణీకులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నించారు. వీరిలో 10 మంది భారతీయులు ఉన్నారు. వారిని మలేషియాలోని అనుమతించకుండా వెనక్కి తిప్పి పంపించారు. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (KLIA) లో ఈ ఘటన జరిగింది.


99 మంది విదేశీ ప్రయాణీకులను వెనక్కి పంపిన అధికారులు

మలేషియా బోర్డర్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (AKPS) అధికారులు తాజాగా KLIA టెర్మినల్ 1లో సుమారు ఏడు గంటల పాటు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించారు. ఎక్కువ ప్రమాదకర విమానాల నుంచి వచ్చిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో సుమారు 400 మందికి పైగా ప్రయాణికులను చెక్ చేశారు. వారిలో 99 మందిని తిరిగి వెనక్కి పంపించారు. వీరిలో 80 మంది బంగ్లాదేశ్ వాసులు ఉండగా, 10 మంది భారతీయులు, 9 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో అందరూ పురుషులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.


ఎందుకు వీరిని వెనక్కి పంపించారంటే?

తాజా తనిఖీల్లో వెనక్కి పంపించిన 99 మంది ప్రయాణీకులు అనుమానాస్పద రీతిలో మలేషియాలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. “తాజాగా వెనక్కి పంపిన విదేశీలకు సంబంధించి విజిటింగ్, జర్నీ రికార్డులు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. చెకింగ్స్ లో సరైన సమాధానాలు చెప్పకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం కారణంగా వారిని దేశంలోకి అనుమతించలేదు” అని AKPS ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది.  ప్రోటోకాల్‌ ప్రకారం వారిని స్వదేశాలకు తరలించినట్లు వెల్లడించింది.

“మలేషియా బోర్డర్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తనిఖీల సందర్భంగా ప్రయాణీకుల బ్యాగ్రౌండ్ వెరిషికేషన్ చేశారు.  ప్రయాణ పత్రాల పరిశీలించారు. వ్యక్తిగతంగానూ వారిని ఇంటర్వ్యూ చేశారు. సరైన సమాధానలు లేకపోవడం వల్లే తిరిగి పంపించాల్సి వచ్చింది.  విజిట్ పాస్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ఇలాంటి తనిఖీలు ఇకపై తప్పకుండా నిర్వహించబడుతాయయి” అని AKPS తెలిపింది.

Read Also: ముందు చక్రం లేని సైకిల్‌పై సాహస యాత్ర.. ఘాట్ రోడ్డులో అతడి అడ్వేంచర్ చూస్తే షాకే!

వీసా రహిత ప్రవేశ పథకాన్ని పొడిగించిన కొద్దిసేపటికే

భారతీయ పౌరులకు  మలేషియా వీసా రహిత ప్రవేశ పథకాన్ని డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. తాజా నిర్ణయం ప్రకారం భారతీయ పర్యాటకులు వీసా లేకుండా ఆ దేశంలో 30 రోజుల వరకు ఉండవచ్చు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని మలేషియా ప్రభుత్వం  భావిస్తోంది.

Read Also: ఇండియాలో ఈ రైళ్లు ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. ఒక్క టికెట్ ధర ఎంతో తెలుసా?

Related News

Cherlapally Station: చర్లపల్లి స్టేషన్ కు అదనపు MMTS రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వ్యాఖ్యలు!

Rakhi Delivery on Trains: నేరుగా రైలు సీటు దగ్గరికే రాఖీలు, ఐడియా అదిరింది గురూ!

Visakhapatnam Expressway: టన్నెల్ ఒడిశాలో.. లాభం మాత్రం విశాఖకే.. ఎలాగంటే?

Multi train ticket: ఒకే టికెట్‌తో మల్టీ ట్రైన్స్ రైడ్… ఛాన్స్ కేవలం ఆ నగరానికే!

AP railway development: ఏపీలో చిన్న రైల్వే స్టేషన్.. ఇప్పుడు మరింత పెద్దగా.. స్పెషాలిటీ ఏమిటంటే?

Hitec city Railway station: కళ్లు చెదిరేలా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌, చూస్తే వావ్ అనాల్సిందే!

Big Stories

×