Indian Railways: దేశంలో రైళ్ల ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేయడంలో రైల్వే ఎంతగానో ఉపయోగపుతుంది. అయితే, కొత్త ప్రాంతాల్లో రైలు ప్రయాణం చేసే సమయంలో ఎక్కడి వరకు చేరుకున్నామో చాలా మందికి తెలియదు. అందుకే పలు పద్దతుల ద్వారా రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) వెబ్ సైట్ ద్వారా
నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) అనేది అధికారిక భారతీయ రైల్వే పోర్టల్. ఈ పోర్టల్ ఉపయోగించి మీ రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్‌ను ట్రాక్ చెయ్యొచ్చు.
⦿ ముందుగా NTES వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
⦿ ఎడమ ప్యానెల్ లోని ఎంపికల జాబితా నుండి స్పాట్ యువర్ ట్రైన్ ను ఎంచుకోండి.
⦿ రైలు పేరు లేదా నంబర్ ను ఎంటర్ చేయండి.
⦿ ఇప్పుడు, మీ ట్రిప్ ప్రారంభ తేదీని ఎంచుకోండి. వెంటనే లైవ్ రన్నింగ్ స్టేటస్, రూట్ మ్యాప్ తో సహా కనిపిస్తుంది.
రైల్ వన్ యాప్ ద్వారా
సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఇటీవల అన్ని రైల్వే సేవలను ఒకే చోట అందించేలా రైల్ వన్ యాప్‌ను ప్రారంభించింది. ఈ సూపర్ యాప్ ద్వారా రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ ను చెక్ చేయవచ్చు.
⦿ ముందుగా రైల్ వన్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
⦿ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి వన్-టైమ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి.
⦿ హోమ్ స్క్రీన్ లో ట్రాక్ యువర్ ట్రైన్ ఎంపికను ఎంచుకోండి.
⦿ రైలు పేరు లేదా నంబర్‌ను నమోదు చేయండి. ప్రయాణ తేదీని ఎంచుకోవాలి.
⦿ రైలు వివరాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
⦿ రూట్ మ్యాప్‌ను రియల్ టైమ్‌లో వీక్షించడానికి కరెంట్ మూవ్‌మెంట్‌ను ఎంచుకోండి.
SMS ద్వారా
మీ రైలు లైవ్ రన్నింగ్ స్థితిని ట్రాక్ చేయడానికి యాప్‌లు ఉన్నప్పటికీ సాంప్రదాయ పద్ధతులు కూడా ఉన్నాయి. మీరు స్మార్ట్ ఫోన్‌లలో మాత్రమే కాకుండా, ఫీచర్ ఫోన్ లలో కూడా SMS ఉపయోగించి ట్రైన్ లైవ్ రన్నింగ్ స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు.
⦿ మీ ఫోన్ లో మెసేజ్ యాప్‌ను తెరవండి
⦿ ‘SPOT’ తర్వాత స్పేస్ ఇచ్చి మీ ఐదు అంకెల రైలు నంబర్ ను టైప్ చేసి 139కి మెసేజ్ పంపించాలి.
⦿ మీ రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ వివరాలు SMS రూపంలో వస్తాయి.
IVRS ద్వారా
IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా కూడా రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ ను పొందే అవకాశం ఉంటుంది.
⦿ మీ ఫోన్ నుండి 139కి డయల్ చేయండి.
⦿ వాయిస్ ప్రాంప్ట్ లను వినండి. రైలు ప్రత్యక్ష ప్రసార స్థితిని తనిఖీ చేయడానికి తగిన ఎంపికను ఎంచుకోండి.
⦿ మీ ఫోన్ కీప్యాడ్‌ని ఉపయోగించి రైలు నంబర్‌ను ఎంటర్ చేయండి.
⦿ అప్పుడు IVRS మీ రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ వివరాలను అందిస్తుంది.
Read Also: ప్లాట్ ఫారమ్ మారడం వల్ల ట్రైన్ మిస్ అయితే, రీఫండ్ వస్తుందా?