Kashmir Vande Bharat Train: జమ్మూకాశ్మీర్ కు రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని తావి నుంచి కాశ్మీర్ లోని శ్రీనగర్ మధ్య కొత్తగా ప్రవేశపెట్టే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవల టైమ్ టేబుల్ ను రైల్వేశాఖ ప్రకటించింది. ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు పరిమిత స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించింది. తావి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, బనిహాల్, శ్రీనగర్ లో రైళ్లు హాల్టింగ్ తీసుకోనున్నాయి.
రెండు జతల రైళ్లు, వారానికి 6 రోజులు..
తాజాగా రైల్వేశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తావి నుంచి శ్రీనగర్ వరకు రెండు జతల రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. 26401/02, 26403/04 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు వారానికి ఆరు రోజుల పాటు నడవనున్నాయి. ఒక రోజు మెయింటెనెన్స్ కోసం కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
టైమింగ్స్ ఇవే!
26402 నెంబర్ రైలు శ్రీనగర్ నుంచి మంగళవారం తప్ప, మిగతా అన్ని రోజులు మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరి 18:50 గంటలకు జమ్మూ తావికి చేరుకుంటుంది. 26404 నంబర్ రైలు శ్రీనగర్‌లో ఉదయం 8:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:40 గంటలకు జమ్మూ తావి చేరుకుంటుంది. ఈ రైలు బుధవారం నడవదు. తిరుగు ప్రయాణంలో 26401 నంబర్ రైలు మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు, జమ్మూలోని తావి నుంచి ఉదయం 6:20 గంటలకు బయలుదేరి 11:10 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. రైలు నంబర్ 26403 జమ్మూ తావిలో మధ్యాహ్నం 13:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. బుధవారం అందుబాటులో ఉండదు.
కాశ్మీర్ పర్యాటకానికి మరింత బూస్టింగ్
జమ్మూకాశ్మీర్ నుంచి శ్రీనగర్ కు రెండు జతల రైళ్లను ప్రకటించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే కనెక్టివిటీ ఆ ప్రాంతంలో పర్యాటకం, వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. పర్యాటకుల రాకపోకలను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా ఆర్థిక ప్రగతి సాధించే అవకాశం ఉందంటున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కత్రా- శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెరుగైన ప్రయాణాన్ని అందించనుంది.
జూన్ 6న రైల్వే సేవలను ప్రారంభించనున్న ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జూన్ 6న జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి కొత్త వందే భారత్ సేవలను ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన, అంజిఖాడ్ దగ్గర నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెనను ప్రారంభించనున్నారు.
Read Also: ప్రపంచంలోనే షార్టెస్ట్ ఫ్లైట్ జర్నీ, ఎంతసేపో తెలిస్తే షాకవ్వాల్సిందే!
రూ. 43 వేల కోట్లతో USBRL ప్రాజెక్టు
ఇక ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైలు లింక్ (USBRL)ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. పర్వత ప్రాంతాల గుండా వెళ్లే 272 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం ఏకంగా రూ. 43,780 కోట్ల వ్యయంతో పూర్తి చేసింది. ఇందులో మొత్తం 119 కిలోమీటర్ల పొడవున 36 సొరంగాలు, 943 వంతెనలు ఉన్నాయి.
Read Also: ఒక్క నిమిషం ఆలస్యంగా చేరిన రైలు.. లోకో పైలెట్ జీతం కట్!