E-Paper
Advertisement

జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!

జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!
Advertisement

Japan PR Rules 2026: జపాన్‌లో స్థిరపడాలని, అక్కడే శాశ్వతంగా ఉండాలని భావిస్తున్న విదేశీయులకు కొత్త నిబంధనలు వచ్చాయి. ఇక జపాన్‌లో శాశ్వత నివాసం(Permanent Residency) పొందాలంటే గతంతో పోలిస్తే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఆదాయం, పెన్షన్, జపనీస్ భాషకు సంబంధించిన అర్హతల విషయంలోనూ కొత్త రూల్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో జపాన్‌లో శాశ్వత నివాసం కోరుకునే విదేశీయులకు ఇకపై నిబంధనలు మరింత కీలకంగా మారనున్నాయి.

రూ.10 వేల నుంచి ఏకంగా రూ. లక్షకు పైగా పెంపు..

ఇప్పటివరకు జపాన్‌లో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు 10,000 యెన్‌లు ఫీజుగా చెల్లించేవారు. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ మొత్తం ఏకంగా 2,00,000 యెన్‌లకు పెరిగింది. అంటే ఫీజు ఒక్కసారిగా 20 రెట్లు పెరిగిందన్నమాట. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.1 లక్షల వరకు ఉంటుంది. డాలర్లలో దాదాపు 1,268 డాలర్లుగా ఉంది. ఇక్కడితో మార్పులు ఆగలేదు. ఇతర రెసిడెన్స్ స్టేటస్‌ లను మార్చుకోవడం, పొడిగించుకోవడానికి కూడా ఫీజులు పెరిగాయి. ఈ పెంపు ద్వారా పెరుగుతున్న విదేశీ నివాసితులకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ నిర్వహణకు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆదాయం కూడా కీలకమే..

Advertisement

కొత్త PR మార్గదర్శకాల్లో ఆదాయానికి మరింత ప్రాధాన్యం ఇచ్చారు. దరఖాస్తుదారుడి ఆదాయం, అదే పరిమాణంలోని జపనీస్ కుటుంబాల సగటు ఆదాయంతో పోల్చి పరిశీలించే విధానం తీసుకొచ్చారు. అంటే, జపాన్‌లో ఉండటానికి సరిపడా డబ్బు ఉందా? లేదా? అన్నదానితో పాటు.. స్థిరమైన ఆదాయంతో తన జీవనాన్ని తానే కొనసాగించగలడా అనే అంశాన్ని మరింత స్పష్టంగా పరిశీలించనున్నారు. కనీస ఆదాయానికి సంబంధించిన కొత్త ప్రమాణాలు ఇప్పటికే కొన్ని దరఖాస్తులకు వర్తించగా, ఇతర మార్పుల్లో ఎక్కువ భాగం 2027 ఏప్రిల్ నుంచి వర్తించనున్నాయి.

పెన్షన్‌ రికార్డుపైనా ఫోకస్‌..

జపాన్‌లో శాశ్వత నివాసం కోరుకునే వారి పెన్షన్ పరిస్థితినీ పరిశీలించనున్నారు. భవిష్యత్తులో పొందే పెన్షన్‌ ప్రయోజనాలు కూడా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైన స్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు లేకపోతే, కొన్ని సందర్భాల్లో పొదుపు, ఇతర ఆస్తుల ద్వారా ఆ లోటును భర్తీ చేసే అవకాశం కూడా కొత్త మార్గదర్శకాల్లో ఉంది.

జపనీస్‌ భాష కూడా ముఖ్యం!

Advertisement

జపాన్‌లో శాశ్వతంగా నివసించాలంటే అక్కడి భాష, సమాజంతో అనుసంధానం కూడా ముఖ్యమనే దిశగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అందులో భాగంగా జపనీస్ భాషపై అవగాహన కూడా PR అర్హతల్లోకి వచ్చింది. అంటే, జపాన్‌లో ఏళ్ల తరబడి నివసించినా.. అక్కడి భాషతో పూర్తిగా సంబంధం లేకుండా ఉండటం ఇక సరిపోకపోవచ్చు. కొత్త మార్గదర్శకాల్లో భాషా సామర్థ్యానికి కూడా స్థానం కల్పించారు.

విదేశీయుల సంఖ్య పెరుగుతున్న వేళ..

జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. 2025 చివరి నాటికి విదేశీ నివాసితుల సంఖ్య రికార్డు స్థాయిలో 41.3 లక్షలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించడంతో పాటు, విదేశీయుల విషయంలో నిబంధనలను స్పష్టంగా రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Read Also: ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?

Tags

Related News

నేషనల్ గార్డ్‌ లో చిన్న కమాండో.. యూనిఫాం, తలకు హెల్మెట్ తో భలే ఉందిగా!

ఇసుకను జల్లెడ పడితే బంగారం దొరుకుతుందట.. మునేరులో వింత వేట!

మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

పెట్రోల్‌ రూల్స్‌ లో బిగ్‌ చేంజ్‌.. లైసెన్సు లేకుండా బిజినెస్ చేస్తే ఇక అంతే సంగతులు!

ఉరిశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?

చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!

ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?

Big Stories

Advertisement
×