Tokara Island: ప్రపంచంలో సుందరమైన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. పర్యాటకులు ఎక్కువగా ఐలాండ్స్‌కు వెళ్తారు. ఎందుకంటే అక్కడ ప్రకృతి అందాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. పర్యాటకులు ఏ ప్రాంతానికి వెళ్లినా పర్వాలేదుగానీ జపాన్‌లోని టోకారా ద్వీపానికి వెళ్లొద్దు. ఎందుకంటే అక్కడి వెళ్లిన నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతారు. అంత డేంజర్ కూడా.
దక్షిణ జపాన్‌లోని కనిపించే ఆ ద్వీపం తెలుసా? దాని టోకారా ద్వీపం అంటారు. విమానం నుంచి చూస్తుంటే గొలుసుల మాదిరిగా ఆ ద్వీపం కనిపిస్తుంది. 12 చిన్నచిన్న దీవుల సమూహారం టోకారా ప్రాంతం. ఆ ప్రాంతంలో 700 మంది ఉంటారు. అక్కడికి వెళ్తే స్వర్గంలోకి వెళ్లినట్టు ఉంటుంది. జనాబా తక్కువే ఉంటారు. మరి భయమొందుకని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వెళ్దాం.
గడిచిన రెండు వారాల్లో 900కి పైగా భూకంపాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ కేంద్రం తెలిపింది. అనుక్షణం వస్తున్న భూకంపాలతో ఆ ప్రాంతవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఒక వేళ ఆ ప్రాంతం విడిచి వెళ్లాలంటే కేవలం చిన్నపాటి క్రూయిజ్ షిప్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది.
గొలుసుల మాదిరిగా ఉండే టోకారా ద్వీపంలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. జూన్ 21 నుండి టోకారా ద్వీపం చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చురుగ్గా ఉన్నాయిని చెబుతున్నారు. భూకంపం-సునామీ పరిశీలన విభాగం డైరెక్టర్ అయటక ఎబిటా తెలిపారు.
ALSO READ: ఏపీలోని ఒక అందమైన ద్వీపం.. ఒక్కసారి కుటుంబంతో వెళ్లండి
JMA నివేదికల ప్రకారం.. టోకారా ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు రెండేళ్ల నుంచి కనిపించడం మొదలుపెట్టాయి. ఆ ఏడాది 346 భూకంపాలు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యంత భూకంపాలు చురుగ్గా ఉండే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పశ్చిమ అంచునున్న నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి. అది జపాన్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అందుకే అక్కడ నిత్యం భూమి అలా కంపిస్తూనే ఉంటుంది.
దాదాపు 125 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఈ ద్వీప సమూహానికి ప్రతీ ఏడాది దాదాపు 1,500 ప్రకంపనలు వస్తుంటాయి. ప్రపంచంలోని భూకంపాలలో దాదాపు 18 శాతం ఇక్కడ సంభవిస్తాయి కూడా. వాటిలో ఎక్కువ తేలిక పాటివి ఉంటాయి. అయినప్పటికీ అవి ఎంతవరకు నష్టం కలిగిస్తాయనేది చెప్పలేము. గతేడాది న్యూ ఇయర్ సందర్భంగా మధ్య జపాన్‌లోని నోటో ద్వీప కల్పంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 600 మంది మరణించిన విషయం తెల్సిందే.