BigTV English

MLA’s VS Officers In Chittoor: చిత్తూర్ జిల్లా ఎమ్మెల్యేలకు షాక్.. అసలేం జరుగుతోంది

MLA’s VS Officers In Chittoor: చిత్తూర్ జిల్లా ఎమ్మెల్యేలకు షాక్.. అసలేం జరుగుతోంది

MLA’s VS Officers In Chittoor: కుప్పం వరకు ఓకే ..మిగతా జిల్లా అంతా ప్రజా ప్రతినిధులతో మనకేం పని .. వారి మాట మనం వినాల్సిన అవసరం లేదు.. అంతా మా ఇష్టం అన్నట్లు సాగుతోందంట చిత్తూరు జిల్లా ఉన్నతాధికారుల తీరు. దీంతో అసలు మనమేందుకు ఇన్ని పోరాటాలు చేసి ప్రజా ప్రతినిధులు అయ్యాం ..కనీసం చిన్నమాట కూడా అధికారులు విననప్పుడు మన పదవులు వల్ల ఒరిగేదేంటి.. ఇంకా వైసీపీ వాసనలు పోని రీతిలో అధికారులు ఉన్నారని తీవ్రంగా మండి పడుతున్నారంట తెలుగు తమ్మళ్లు..తాజాగా జరుగుతున్న సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో మరింత దారుణంగా అవమానానికి గురయ్యామని వాపోతున్నారంట…


కుప్పం టీడీపీ నేతలకు సహకరిస్తున్న చిత్తూరు అధికారులు

చిత్తూరు జిల్లా అంటే సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడి సొంత జిల్లా .. అయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఆ జిల్లాలోనే ఉంది .. అయితే కుప్పం వరకు అన్ని రకాలుగా ప్రజా ప్రతినిధులకు సహకరిస్తోందంట జిల్లా యంత్రాంగం. అంతే కాదు కుప్పంలోని మండల స్థాయి నాయకుల మాటలు కూడా జిల్లా ఉన్నతాధికారులు వింటారంట.. విభజిత చిత్తూరు జిల్లాలో మిగతా ఐదు నియోజకవర్గాల విషయానికి వస్తే టీడీపీ నేతలను డోంట్ కేర్ అంటున్నారంట. దాంతో అసలు ఏమి జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకోవాల్సి వస్తోందంట


సీఎం ముందు అన్నిటికీ ఓకే అంటున్న అధికారులు

సియం చంద్రబాబు కుప్పం వచ్చినప్సడు అయన దగ్గర అన్నింటికి ఓకే అనే జిల్లా ఉన్నతాధికారులు… ఆ తర్వాత తమను కనీసం ప్రజా ప్రతినిధుల్లా చూడటం లేదని.. జిల్లాలో ఉన్నతాధికారులకు ఇంకా పాత వాసనలు పోలేదని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారుల పై వివాదాస్పదంగా వార్తలు వస్తున్నాయి. జిల్లా ఎస్పీ తమ సూచనలు పట్టించుకోవడం లేదని, ముసలి ముతకా అనే తేడా లేకుండా , పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారిని మారు మూల ప్రాంతాలకు విచక్షణ లేకుండా బదిలీ చేస్తున్నారని అప్పట్లో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

వైసీపీ అనుకూల అధికారులకు కీలక స్థానాలు ఇచ్చారని అగ్రహం

వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు దేశం క్యారకర్త దారుణ హాత్యకు కారణమైన వైసీపీ అనుకూల అధికారులకు కీలక స్థానాలు ఇచ్చారని అమర్‌నాథ్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ ఎమ్మెల్యేల సూచనలు పట్టించుకోకుండా , ప్రాథమికంగా ఎలాంటి కౌన్సిలింగ్ కూడా నిర్వహించకుండా ఎస్పీ బదిలీలు చేశారు..అది పెద్ద వివాదం అయ్యింది. దాంతో పాటు నగరి నియోజకవర్గంలోని ఓ వివాదస్పద అధికారిని బదిలీ చేయ్యమని స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కోరినా వినిపించుకోలేదంట. దీంతో ఆయన చివరకు సీఎంఓ నుంచి ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారంట. దానికి తోడు గతంలో లోకేష్ పాదయాత్రలో వివాదాస్పదంగా వ్యహారించిన అధికారిణికి కీలక పోలీస్ స్టేష్టన్‌లో పోస్టింగ్ ఇవ్వడంతో టిడిపి నేతలు ఆమెను బదిలీ చేయమంటూ హోంమంత్రి కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందంట.

సచివాలయ ఉద్యోగుల బదిలీల తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం

తాజాగా ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సచివాలయ ఉద్యోగులు బదిలీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాఉన్నతాధికారులు అడ్డగోలుగా వ్యవహారిస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. ప్రతి ఎమ్మెల్యే కనీసం తమ వారంటూ ఓ పది మందికి అయిన సిఫార్సు చేసి ఉంటారు. అయితే వారి సిఫార్సులు బుట్టదాఖలు చేసి కుప్పంలో ముందుగా సచివాలయ ఉద్యోగులను పుల్ పిల్ చేసి మిగతా చోట్ల వారందరిని ఇష్టాను సారం బదిలీ చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని తిరుపతి జిల్లా ఎంఎల్‌ఎలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దార్థజైన్ ఉన్నప్పటి పరిస్థితే వస్తుందని గగ్గోలు

గతంలో బదిలీల విషయంలో గతంలో ఎలా వ్యహారించారో గుర్తుకు రావడంలేదా? జిల్లా కూటమి నేతలు మండి పడుతున్నారు. దానికి తోడు అధికారుల పెత్తనం ఎక్కువయితే గతంలో సిద్దార్థ్ జైన్ ఎస్పీగా ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా అలాగే అవుతుందని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పుడు వైసీపీ పక్షపాతి ఒక్కడే ఉండే వాడని ఇప్పుడు చాలామంది తయారయ్యారని అంటున్నారు. మొత్తం మీదా సచివాలయాల సిబ్బంది బదిలీల తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అగ్రహంతో ఉన్నారంట. అధికారుల బదిలీల విషయంలో కూడా ఓ ఉన్నతాధికారి ఇలాగే వ్యవహారించాడని, కబ్జాల అరోపణలు ఉన్న ఓ మహిళ అధికారి బదిలీ నిలిపి వేయించడానికి ప్రయత్నించాడని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి..

వైసీపీ నేతల సిఫార్సులతో బదిలీలు చేస్తున్నారని ఆరోపణ

అధికారుల వైఖరితో నియోజకవర్గాల వారీగా సుపరిపాలన టిడిపి కార్యక్రమాలను జనంలోకి తీసుకుపోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని.. వైసిపి వాసనలున్న అధికారులు ఆ పార్టీ నేతల సిఫార్సులతో బదిలీలు జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.. ఎమ్మెల్యేల సిఫార్సులను బుట్టదాఖలు చేసి తమకు ఇష్టమైన వారికి ఇష్ట మైన చోట వైసీపీ నేతలు పోస్టింగులు ఇప్పించారని అంటున్నారు. మొత్తం మీదా శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి ఎమ్మెల్యేలు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు..

Also Read: ఈ టైమ్‌లో క్యాబ్ ఎక్కారో.. జేబులు ఖాళీ!

వెంటనే బదిలీలపై అధికారులు పునారాలోచన చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారంట. మొత్తమ్మీద గతంలో వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులకు జీహూజుర్ అన్ని అధికారులు .. ఇప్పుడు మాత్రం తమదే పైచేయి అన్నట్లు ప్రజా ప్రతినిధులపై పెత్తనం చేయడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారంట.

Story By Apparao, Bigtv

Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×