Telangana: ఇది రైతు ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం. రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం. వ్యవసాయ రంగాన్ని ఉత్తమం చేసే దిశగా రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. రైతులకు సమస్య వస్తే అండగా నిలబడుతోంది. రూ.21వేల కోట్ల నిధులతో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది ఈ సర్కార్. సన్న వడ్లకు బోనస్ కూడా కల్పిస్తుంది. సీఎం రేవంత్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు యంత్ర పరికరాలు సమకూరుస్తున్నారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ భూభారతి చట్టం తీసుకొచ్చింది. పండిన పంట ఇంటికి చేరేవరకు రైతుకు టెన్షనే. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంటలు భారీ దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గడిచిన రెండు నెలలుగా వడగళ్ల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం విడుదల చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రేవంత్ సర్కార్ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వడగళ్ల వర్షం, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంట నష్ట పరిహారం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
దీంతో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాబోతున్నాయి. మొత్తం రాష్ట్రంలో29 జిల్లాల్లో 5528 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 41,361 మంది రైతులకు నష్ట పరిహారం నిధులు వారి అకౌంట్లో జమకాబోతున్నాయి. దీని కోసం రేవంత్ సర్కార్ 51.528 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని.. త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: CM Chandrababu: ఆ వార్తలు అబద్దం.. కర్ణాటక ప్రజల అపోహ, నా చరిత్రలో లేదన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో నష్టపోయిన పంట వివరాలు ఇలా ఉన్నాయి. వరి 36,424 ఏకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, ప్రత్తి 4753 ఎకరాలు, ఇతర పంటలు 477 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే మే నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన రిపోర్టును కూడా ప్రభుత్వం రెడీ చేసింది. వాటికి సంబంధించిన నిధులను కూడా త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ALSO READ: Gruhini Scheme: కొత్త పథకానికి ప్రభుత్వం ప్లాన్.. మహిళల పేరుతో