Namo Bharat Rapid Rails: ప్రకృతి అందాలకు నెలవైన కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రాష్ట్రానికి ఏకంగా 10 వందే భారత్ మెట్రో రైళ్లను కేటాయించింది. అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉన్న ఈ రైళ్లు కేరళ టూరిజానికి మరింత ఊతం అందించబోతున్నాయి. దేశ రైల్వే ప్రయాణాన్ని సరికొత్త స్థాయినిక తీసుకెళ్లిన వందే భారత్ రైళ్లు, ఇప్పుడు నమో భారత్ రాపిడ్ రైళ్లుగా అప్ డేట్ అయ్యాయి. మెట్రో సేవలను అందించబోతున్నాయి. కేరళలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. నమో భారత్ సేవలు కేరళ పర్యాటక రంగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడంతో పాటు, పలు పర్యాటక ప్రాంతాలకు కనెక్టివీటీని పెంచనున్నాయి. ఈ 10 రైళ్లు కేరళలోని అన్ని టూరిజం స్పాట్లను కవర్ చేయనున్నాయి.
నమో భారత్ రైళ్ల మార్గాలు, స్టాప్‌లు
కేరళలోకి అడుగు పెట్టనున్న నమో భారత్ రైళ్లు కీలక ప్రాంతాల్లో సేవలను అందించనున్నాయి. పది కొత్త సర్వీసులలో రెండు రైళ్లు కొల్లాం నుంచి తిరునెల్వేలి, త్రిస్సూర్ మార్గాల్లో నడవనున్నాయి. త్రిస్సూర్ మార్గాన్ని టెంపుల్ సిటీ గురువాయూర్ వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. తిరువనంతపురం నుంచి ఎర్నాకులం, గురువాయూర్ మంచి మధురై వరకు నమో భారత్ సర్వీసులు నడవనున్నాయి. ఈ నెట్ వర్క్ తో స్థానిక ఆర్థిక వ్యవస్థల బలోపేతం కావడంతోపాటు, పర్యాటకులకు సరికొత్త అనుభూతులను కలిగించే అవకాశం ఉంది.
తీరప్రాంతం, బ్యాక్ వాటర్స్, కొండలు, అడవులకు ప్రసిద్ధి చెందిన కొల్లాం ప్రాంతానికి వందేభారత్ సేవలు మరింత మేలు చేకూర్చనున్నాయి. ప్రకృతి అందాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు కొత్త నమో భారత్ మార్గాలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. కొల్లాం-త్రిస్సూర్, కొల్లాం-తిరునెల్వేలి మార్గాలతో పాటు, గురువాయూర్-మధు, ఎర్నాకులం-తిరువనంతపురం రైళ్లు కొల్లాంలో కాసేపు ఆగుతాయి. తిరునెల్వేలి, మధురైకి వెళ్లే రైళ్లు కొల్లాం-షెంకోట్టై లైన్ గుండా ప్రయాణిస్తాయి ఈ కొత్త రైళ్ల కోసం చిన్న స్టేషన్లలో స్టాప్ ఓవర్లు ప్రాంతీయ అభివృద్ధికి, పర్యాటకానికి మరింత తోడ్పడనున్నాయి.
కేరళకు కేటాయించే రైళ్ల ప్రత్యేకత
ఇంటర్ సిటీ ప్రయాణాల కోసం రూపొందించిన నమో భారత్ రైళ్లు మెట్రో సేవలను అందిస్తాయి. అధిక వేగం, అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంటాయి. ఈ రైళ్లు 100 నుంచి 250 కిలో మీటర్ల మార్గాల్లో సేవలు అందిస్తాయి. ప్రాంతీయ కనెక్టివిటీకి ఈ రైళ్లను సమర్థవంతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
Read Also: ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ రైల్వే లైన్స్ .. వెళ్తుంటే వణుకు పుట్టాల్సిందే!
రూ. 30 నుంచి టిక్కెట్ ఛార్జీలు ప్రారంభం
కేరళలో అందుబాటులోకి తీసుకొస్తున్న రైళ్ల కనీస టికెట్ ధరను రూ. 30గా నిర్ణయించారు. వారం నుంచి నెల వరకు సీజన్ టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ టిక్కెట్లు 20 సింగిల్ జర్నీల ఖర్చుతో ప్రయాణాన్ని అందిస్తాయి. ఈ రైళ్ల ద్వారా పర్యాటకులు తక్కువ సమయంలో అన్ని ప్రసిద్ధ ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.
Read Also: ఒకే ట్రాక్ మీదకు దూసుకొచ్చిన రెండు రైళ్లు.. లోకో పైలెట్ అలా చేసి ఉండకపోతే, భారీ ప్రమాదం