South Central Railway: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. గతంతో పోల్చితే ఈసారి ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ కోసం 112 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు అదనంగా మరో 60 రైళ్లను షెడ్యూల్ చేసినట్లు తెలిపింది.
సాధారణ రైళ్లకు అదనపు బోగీలు
సంక్రాంతి పండుగ వేళ ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాట్లు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 172 ప్రత్యేక రైళ్లతో పాటు మరో 90 పాసింగ్ త్రూ రైళ్లను కూడా నడిపించనున్నట్లు తెలిపారు. గత ఏడాది 70 ప్రత్యేక రైళ్లలను నడిపినట్లు తెలిపిన రైల్వే అధికారులు.. ఈ ఏడాది ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అందుకు తగినట్లు 170 నుంచి 180 రైళ్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి రెట్టింపు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. “సంక్రాంతి సందర్భంగా సిక్రింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి స్టేషన్లలో పెద్ద సంఖ్యలో రద్దీ ఉండనుంది. ఈ మార్గాల్లో ఎక్కువగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం. ప్రయాణీకుల భద్రతకు సంబంధించి రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు” అని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆరో శ్రీధర్ వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లలు అదనపు ఛార్జీలు
ఇక సంక్రాంతికి ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో సాధారణ రైళ్లతో పోల్చితే ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతున్న ఈ రైళ్లలో కొంత మేర టికెట్ ధర పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు కూడా ఎక్స్ ప్రెస్ రైళ్ల మాదిరిగానే ఒకే మార్గంలో ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు.
ప్రత్యేక బస్సులు ప్రకటించిన ఆర్టీసీ సంస్థలు
సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే తెలంగాణ, ఏపీ ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక బస్సులు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ ఏపీకి 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ 2400 అదనపు బస్సులను అనౌన్స్ చేసింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరం అయితే, మరిన్ని అదనపు రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించాయి.
సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీ
ఇక సంక్రాంతి పండుగ వచ్చిదంటే హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే ఆంధ్రా ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. తెలంగాణతో పోల్చితే ఆంధ్రాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మూడు రోజుల పాటు బంధుమిత్రులతో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబురాలను జరుపుకుంటారు. దేశంలో ఎక్కడ ఉద్యోగాలు చేసినప్పటికీ సొంతూరుకి వచ్చి మూడు రోజుల పాటు హ్యాపీగా జాలీగా గడుపుతారు. హరిదాసు గీతాలు, కోడిపందాలు ఆడుతూ ఎంజాయ్ చేస్తారు.
Read Also: సంక్రాంతి వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు