Rajnath Singh: భారత్, దాయాది దేశం పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశంలో దాడులకు ప్రయత్నించేవారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. అమాయక టూరిస్టులపై దాడి చేసిన ఉగ్రవాదలను ఎక్కడున్నా.. పట్టుకుని శిక్షస్తామని అన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు.
దేశ సరిహద్దుల భద్రతతో పాటు పోలీసు బలగాలను కూడా కాపాడుకోవడం.. రక్షణ మంత్రిగా తన బాధ్యత అని చెప్పారు. ప్రధాని మోదీ పని తీరు, పట్టుదల గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. ప్రధాని నాయకత్వంలో భారతదేశ ప్రజలు కోరుకున్నది కచ్చితంగా జరిగి తీరుతుందని.. అది దేశ ప్రజలే చూస్తారని ఆయన హామీ ఇచ్చారు.. ఇటీవల కశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, పాక్‌పై ప్రతీకార చర్యలను కేంద్రం పరిశీలిస్తున్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మన దేశ వీర సైనికులు ఎల్లప్పుడూ దేశ సంరక్షణ కోసం పాటు పడుతుంటే.. రుషులు, జ్ఞానులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారని చెప్పారు. ఓ వైపు భారత సైనికులు యుద్ధ భూమిపై అహర్నిశలు పోరాటం చేస్తుంటే.. సాధువులు జీవన భూమిపై పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. దేశ సరిహద్దుల భద్రతతో పాటు సైనికులను కాపాడటం తన బాధ్యత అని పేర్కొన్నారు.
Also Read: NMDC Jobs: డిగ్రీ అర్హతతో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇంకా 4 రోజులే, రూ.లక్షల్లో జీతాలు
మన దేశంపై దాడికి ప్రయత్నించేవారికి తగిన రీతిలో బదులివ్వడం తన ప్రత్యేకత విధి అని తెలిపారు. దేశ ప్రజలందరికీ మన ప్రధాని గురించి బాగా తెలుసునని అన్నారు. ఆయన వర్కింగ్ స్టైలేంటో, పట్టుదల ఏంటో తెలుసునని వ్యాఖ్యానించారు. ఆయన సారథ్యంలో భారత దేశ ప్రజలు కోరుకున్నది కచ్చితంగా జరుగుతుందని.. హామీ ఇస్తున్నట్టు చెప్పారు. భారత్ శక్తి సాయుధ దళాల్లోనే కాదు.. దాని సంస్కృతి, ఆధ్యాత్మికతలోనూ ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Also Read: India Pak War: 130 అణుబాంబులతో రెడీగా ఉన్నాం.. పాక్ మరో బహిరంగ హెచ్చరిక.. (వీడియో)