Inzamam-ul-Haq Slams Virat Kohli: పొద్దున లేస్తే చాలు టీమిండియాపై పాకిస్తాన్ మాజీలు విమర్శలు చేస్తూనే ఉంటారు. టీమిండియా గెలిస్తే ఫిక్సింగ్ అని, ఓడిపోతే చేతకాలేదంటూ రచ్చ చేస్తూంటారు. ఇక మనోళ్లు సెంచరీలు చేస్తే, బ్యాట్లలో స్ప్రింగులు, చిప్స్ పెట్టారని ఆరోపణలు చేయడం సహజమైపోయింది. అయితే, బాబర్ ఆజం టీ20 కెరీర్ అంతరించిపోతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీని ( Virat Kohli:) విమర్శిస్తూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) రెచ్చిపోయాడు.
బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ? అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ, ఎప్పటికీ టీ20లలో విరాట్ కోహ్లీ కంటే, బాబర్ ఆజం బెస్ట్ క్రికెటర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. బాబర్ ఆజం (Babar Azam) కంటే గొప్పుడు అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక్క ట్రోఫీ కూడా ఎందుకు అందించలేదని సీరియస్ అయ్యారు. దీనిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ జవాబు చెప్పాలని చురకలు అంటించారు. దీంతో విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
విరాట్ కోహ్లీ పోటుగాడే అయితే, RCBకి ఎందుకు ట్రోఫీ తేలేదంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) హేళన చేశారు. టీ20లలో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేస్తాడని పరువు తీశారు. అతడు టీ20లలో అద్భుతాలు సృష్టించిన సందర్భాలు చాలా తక్కువే అంటూ చురకలు అంటించారు. RCB కెప్టెన్ గా విరాట్ కోహ్లీ చాలా సంవత్సరాలు పని చేసినప్పటికీ, టైటిల్ మాత్రం అందించలేక విఫలమైనట్టు పేర్కొన్నారు. మైదానంలో ఓవరాక్షన్ చేయడం తప్ప పీకిందేమీ లేదని పరువు తీశారు.
అయితే, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో బాబర్ ఆజం ఒక్క ట్రోఫీనే గెలిచాడని, కానీ మూడు గెలిచినట్టు తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. అబద్దాలు చెబితే, అతికినట్టు ఉండాలని కౌంటర్ ఇస్తున్నారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ వల్లే, 2025, 2026 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వరుసగా రెండు ట్రోఫీలు వచ్చాయన్నారు. ఈ విషయాలు తెలియకుండా మాట్లాడితే, చెప్పు తెగుద్ది అంటూ కౌంటర్ ఇస్తున్నారు.