Psychological Horror Thriller: ఎక్కడైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళను పెద్దలు జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఓ ఇంట్లో మాత్రం అలా ఆడుకుంటూ ఉండాల్సిన చిన్నారి స్థానంలో ఓ బొమ్మ ఉంటుంది. కానీ ఆ ఇంటి తల్లిదండ్రులు మాత్రం దానిని నిజమైన బిడ్డలానే చూసుకుంటారు. తినిపిస్తారు… మాట్లాడతారు… బట్టలు మారుస్తారు. తమ బిడ్డ చనిపోయిన విషయాన్ని అంగీకరించలేని ఆ కుటుంబంలోకి ఓ నానీ అడుగు పెడుతుంది. ఆమెకు ఇచ్చిన పని ఆ బొమ్మను చూసుకోవడమే. కానీ ఆ ఇంట్లో జరుగుతున్న వింతలు ఆమెకు అర్థమయ్యే కొద్దీ భయం పెరుగుతుంది. ఈ మిస్టరీకి వెనుక ఉన్న అసలు శక్తి ఏంటనేది ‘సర్వెంట్’ (Servant) కథలో ప్రధాన అంశం. మరి ఈ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో ఉందా ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఫిలడెల్ఫియాలో డొరోథీ, సీన్ టర్నర్ దంపతులు తమ చిన్నారి జెరికోను కోల్పోతారు. ఆ విషాదం తర్వాత వారి దాంపత్య జీవితంలో పెద్ద లోటు ఏర్పడుతుంది. ముఖ్యంగా డొరోథీ ఆ నిజాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంటుంది. బిడ్డ స్థానంలో ఓ రీబోర్న్ డాల్ ను పెట్టుకుని దానినే జెరికోగా భావిస్తూ జీవిస్తుంది. ఈ పరిస్థితుల్లో లీన్ గ్రేసన్ అనే నానీ ఆ ఇంట్లోకి వస్తుంది. డొరోథీ, సీన్ ఆ బొమ్మను నిజమైన బిడ్డలా చూసుకోవడానికి ఆమెను నియమించుకుంటారు.
మొదట లీన్ కు ఇది కొంత వింతగా అనిపించినా, ఆమె ఆ కుటుంబం చెప్పిన నియమాల ప్రకారం పని చేయడం మొదలు పెడుతుంది. కానీ లీన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. బొమ్మతో ఆమె వ్యవహరించే తీరు మిగతా వారితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సీన్ కు ఇంట్లో జరుగుతున్న విషయాలపై అనుమానం మొదలవుతుంది. డొరోథీ మాత్రం తన బిడ్డ విషయంలో ఎలాంటి ప్రశ్నలు వినడానికి సిద్ధంగా ఉండదు. డొరోథీ తమ్ముడు జూలియన్ కూడా లీన్ పై నిఘా పెట్టడం మొదలు పెడతాడు. లీన్ గతం గురించి పెద్దగా సమాచారం ఉండదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ? టర్నర్ కుటుంబంతో ఎందుకు ఇంతగా కలిసిపోయింది ? అనే విషయాలు ఒక్కొక్కటిగా మిస్టరీగా మారతాయి.
ఒక దశలో ఆ ఇంట్లోని బొమ్మ చుట్టూ జరిగే పరిణామాలు కుటుంబం మొత్తాన్ని కుదిపేస్తాయి. డొరోథీకి కనిపించేది ఒకటి, సీన్ కు అర్థమయ్యేది మరొకటి. లీన్ మాత్రం తనకంటూ ఓ రహస్య ప్రపంచంలో ఉంటుంది. ఆమె రాకకు ముందు జరిగిన విషాదం, ఆమె వచ్చిన తర్వాత కనిపిస్తున్న మార్పులకు ఏమైనా సంబంధం ఉందా ? అనే అనుమానాలు షురూ అవుతాయి. అసలు ఆ ఇంట్లో దాగి ఉన్న రహస్యాలు ఏంటి ? లీన్ ఉద్దేశం, జెరికో మరణం వెనుక ఉన్న నిజాలు ఏంటి ? అసలు ఆ నానీ ఎవరు ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. కుటుంబ విషాదం, భయం, అతీంద్రియ అంశాలను కలిపిన ఈ సిరీస్ లో ప్రతి సీజన్ లోనూ మిస్టరీ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
లారెన్ అంబ్రోస్ (Lauren Ambrose), టోబీ కెబెల్ (Toby Kebbell), రూపర్ట్ గ్రింట్ (Rupert Grint), నెల్ టైగర్ ఫ్రీ (Nell Tiger Free) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ‘సర్వెంట్’ను టోనీ బాస్గలోప్ (Tony Basgallop) రూపొందించారు. ఎం. నైట్ శ్యామలన్ (M. Night Shyamalan) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. Apple TVలో మొత్తం సిరీస్ అందుబాటులో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ లేదు, అయితే తెలుగు సబ్‌టైటిల్స్ తో సినిమాని చూడవచ్చు.
Read Also: ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా