India fast train network: ఎప్పటినుంచో ట్రాఫిక్‌తో వాయిదాలు పడుతున్న మీ కార్యాలయాలు, క్లాసులు ఇక సమయానికి మొదలవుతాయి. 80 కిలోమీటర్ల దూరం ఇక గంటల కాదు… నిమిషాల మాట మాత్రమే. వేగం అంటే ఏమిటో చూపించేందుకు సిద్ధమవుతోంది ఉత్తర భారతంలో మరో అద్భుతం!
ఓపిక కోల్పోతున్న నగరాలు, ట్రాఫిక్‌ను తట్టుకోలేని ప్రయాణికులు.. రోజూ రద్దీ బస్సులు, నెమ్మదిగా కదిలే రైళ్లు, ఇసుక గడియారంలా పోతున్న సమయం. ఇలాంటి వేళ లక్నో-కాన్పూర్ హైస్పీడ్ కారిడార్ మాత్రం చల్లదనం నింపుతోంది. మీరట్-ఢిల్లీ మధ్య పరిగెడుతున్న రాపిడ్ రైల్ తరహాలోనే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మరో వేగవంతమైన ప్రయాణ మార్గం సిద్ధమవుతోంది. ఇది పూర్తయితే రెండు మెట్రో నగరాల మధ్య ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో పూర్తయ్యేలా మారుతుంది.
ఇప్పటికే లక్నో, కాన్పూర్ రెండు బిజీ నగరాలే. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారం.. ఈ రెండింటికీ మధ్య ఎంతో మంది రోడ్ మీద వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ట్రావెల్ టైం దాదాపు 2 గంటలు పడుతోంది. ట్రాఫిక్, పాతబస్తీ రోడ్లు, నెమ్మదిగా నడిచే బస్సులు ఇవన్నీ అక్కడ కాస్త ఇబ్బందే. కానీ ఈ హైస్పీడ్ కారిడార్ వచ్చిన తర్వాత మాత్రం గేమ్ మారిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటే లక్నో నుండి కాన్పూర్‌కి ప్రతి గంటకి రైళ్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మీరట్-ఢిల్లీ మాదిరిగానే, గంటకు 160-180 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే రైళ్లుగా రూపొందిస్తున్నారు. అంటే పొద్దున్న లక్నోలో టీ తాగి, కాన్పూర్‌లో 10 గంటల మిటింగ్‌కు వెళ్లొచ్చు!
ఇంత ఫాస్ట్‌గానూ, సౌకర్యంగా ఉండే ఈ ప్రయాణం వల్ల రెండు నగరాల మధ్య సంప్రదాయ రవాణా మార్గాలపై బాగా తగ్గుదల ఉండబోతోంది. దాంతో పాటు చిన్న పట్టణాల అభివృద్ధి కూడా ఊపందుకుంటుంది. స్టేషన్లు మధ్యలో వచ్చే చోట్ల వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరగనున్నాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి DPR (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేస్తున్నారు. స్టేషన్లు ఎక్కడెక్కడ పెట్టాలి? ఎంత ఖర్చవుతుంది? ఏఏ టెక్నాలజీ ఉపయోగించాలి? అన్నదానిపై అధికారులు తీవ్రంగా పని చేస్తున్నారు. ఈ కారిడార్‌ని మోడ్రన్ ఫెసిలిటీలతో తీర్చిదిద్దబోతున్నారు. స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, టికెట్‌లను మొబైల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే అవకాశం, పార్కింగ్, ఫుడ్‌కోర్ట్ సదుపాయాలను ఇండియన్ రైల్వే కల్పిస్తోంది. అదీ కాకుండా, సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. మధ్య తరగతి, డైలీ కమ్యూటర్స్, స్టూడెంట్స్, వర్కింగ్ వుమెన్, చిన్న వ్యాపారులు వంటి వారికీ ఇది ఓ వరం అవుతుంది. ముఖ్యంగా రోజూ వెనక్కి ముందుకెళ్లే ప్రజల కోసం ఇది సరళమైన, శక్తివంతమైన పరిష్కారం. ఇది కేవలం రైలు ప్రాజెక్ట్‌నే కాదు.. ఇది భవిష్యత్ ప్రయాణ సంస్కృతికి నాంది. హైస్పీడ్ కనెక్టివిటీ వల్ల సమయాన్ని ఆదా చేయడం మాత్రమే కాదు, జీవనశైలీకి ఒక కొత్త వేగం వస్తుంది. ఇక టూరిజానికి ఇది ఓ బూస్ట్ అవుతుంది.
అదీ కాకుండా, ఇది పర్యావరణానికి కూడా మేలు చేసే ప్రాజెక్ట్. ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గించి కార్బన్ ఉద్గారాలపై నియంత్రణ తీసుకురావడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇంధన ఖర్చులు తగ్గుతాయి, ప్రజలకు చవకగా, వేగంగా ప్రయాణించేందుకు ఇది మరింత గొప్ప ఆప్షన్ అవుతుంది.
ఇక ప్రభుత్వ ప్రణాళికల్లో ఈ ప్రాజెక్ట్‌కి పెద్ద ప్రాధాన్యత ఉంది. భారతదేశంలోని మెట్రో నగరాల్ని వేగంగా కనెక్ట్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విధంగా ముందుకు వెళ్తున్నాయి. దీనివల్ల భవిష్యత్ నగరాల అభివృద్ధి, మెట్రో జీవిత పద్ధతులు, ప్రజలకి టెక్నాలజీ ఆధారిత జీవితం మరింత చేరువ కానుంది.