Vizag to Chennai Cruise ship: విమాన ప్రయాణం లగ్జరీ కాదు అని భావిస్తున్నారా? ఇప్పుడు సముద్రంపై షిప్‌లోనే హోటల్ అనుభూతిని ఆస్వాదించే అవకాశం వచ్చేసింది! విశాఖ నుంచి చెన్నైకి కార్డిలియా క్రూయిజ్ షిప్ ప్రారంభం కావడంతో, అలల మధ్య ఓ సూపర్ ట్రిప్‌కి టికెట్ బుక్ చేసుకునే టైం వచ్చేసింది.
వైజాగ్ నుంచి చెన్నై వరకు సముద్రం మీదుగా క్రూయిజ్ షిప్ ప్రయాణం అనే విషయం వినగానే ఒక్కసారి ఆశ్చర్యం కలగవచ్చు కానీ, ఇప్పుడు ఆ కల నిజమైంది. ఓ డబ్బు ఉన్నవాళ్ల కోసం మాత్రమే క్రూయిజ్ అనేదే కాలం గతించిపోయింది. ఇప్పుడు సరాసరి మన విశాఖపట్నం నుంచే చెన్నైకి సముద్ర మార్గంలో సూపర్ లగ్జరీ షిప్‌లో ప్రయాణించొచ్చు. ఈ కొత్త ప్రయాణానికి పేరు కార్డిలియా క్రూయిజ్. ఇది 2 నైట్లు – 3 రోజులకు ప్లాన్ చేయబడిన ఒక ప్రత్యేకమైన టూర్.
ఈ క్రూయిజ్ విశాఖ పోర్ట్ నుంచి బయలుదేరి బంగాళాఖాతంలో తేలుతూ, ఓ రోజు సముద్రంపై ప్రయాణం అనుభవాన్ని ఇస్తుంది. ఆ తర్వాత నేరుగా చెన్నై పోర్ట్ దగ్గర దిగుతారు. ఈ మొత్తం ప్రయాణంలో మీరు ఉన్నదే ఓ లగ్జరీ హోటల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో స్విమ్మింగ్ పూల్, మల్టీ క్యూసిన్ రెస్టారెంట్లు, లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్, థియేటర్, స్పా, జిమ్, కసినో, షాపింగ్.. అన్నీ ఉన్నాయి. ఇవే కాదు, బెల్కనీ రూములు, సముద్రాన్ని వీక్షించే సూట్లు కూడా ఉంటాయి. పిల్లల కోసం గేమ్ జోన్‌లు, ఫ్యామిలీ ఫన్ యాక్టివిటీలు ప్రత్యేకంగా ఉంటాయి.
ధరల విషయానికి వస్తే… అత్యంత కనిష్ట రేటు ఒక ఇంటీరియర్ రూమ్‌కు సుమారు రూ. 18,000 నుంచి ప్రారంభమవుతుంది. ఓషన్ వ్యూ రూమ్‌లు రూ. 23,000కి, బెల్కనీ రూమ్‌లు రూ. 30,000కి దగ్గరగా ఉంటాయి. సూట్లు అయితే రూ. 50,000కి పైగా ఉండొచ్చు. వీటిలో కొన్ని భోజనాలు, షిప్ ఎంటర్టైన్మెంట్, పన్నులు వంటివి కలిపి ఉంటాయి. కానీ డ్రింక్స్, ప్రత్యేక కార్యకలాపాలు అదనంగా చార్జ్ చేయబడతాయి.
ఈ ప్రయాణం కోసం వీసా, ఫ్లైట్ బుకింగ్స్ లేవు. సులభంగా మన విశాఖపట్నం నుంచే ప్రయాణం మొదలవుతుంది. అందుకే ఇది కొత్తగా వివాహం అయిన దంపతులకు, ఫ్యామిలీ హాలిడే ప్లాన్ చేస్తున్న వారికి, లేదా జీవితంలో ఒకసారి వావ్ అనిపించే అనుభవం కోసం చూస్తున్న వారికి పర్ఫెక్ట్ ట్రిప్.
ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది.. ఈ క్రూయిజ్ ప్రయాణం వల్ల మన విశాఖ టూరిజంకి ఒక కొత్త చైతన్యం వచ్చిందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సాగర మాలా ప్రాజెక్టులో భాగంగా విశాఖ పోర్ట్ వద్ద క్రూయిజ్ టర్మినల్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల భారత తీరాల్లోని పర్యాటక అవకాశాలను మరింతగా వృద్ధి చేయవచ్చు. విదేశాల నుంచి కూడా క్రూయిజ్ షిప్‌లు రాబోవటంతో, మన రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది.
ఈ క్రూయిజ్ ఒక ప్రయాణం మాత్రమే కాదు.. ఇది సముద్రం మీదుగా సాగిన ఒక కల. అలల మధ్య ఆ హమ్మింగ్ సౌండ్, ఆ ఓపెన్ డెక్ పైన సూర్యాస్తమయం చూస్తూ కాఫీ తాగే అనుభూతి ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్లాలనిపించక మానదు. ఈసారి సముద్రాన్ని దగ్గరగా చూడాలి అనుకుంటే, షిప్ టికెట్ బుక్ చేయండి. అలా మొదలవుతుంది మీ ఫ్లోటింగ్ ఫెస్టివల్!