Indian Railways: ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై లోకల్ రైళ్లలో నిత్యం జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్ డోర్-క్లోజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ రోజు ఉదయం ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కదులుతున్న లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళుతుండగా.. ముంబ్రా-దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే, ముంబై లోకల్ ట్రైన్లలో ఆటోమెటిక్ డోర్ క్లోజర్లు అమర్చాలని నిర్ణయం తీసుకుంది.
రైల్వే బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబై సబర్బన్ నెట్‌వర్క్ కోసం కొత్తగా తయారుచేస్తున్న అన్ని రైలు భోగీలకు ఇక ఆటోమేటిక్ డోర్ క్లోజర్‌లను అమర్చనున్నట్టు రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా, ప్రస్తుతం సేవలు అందిస్తున్న అన్ని పాత డోర్ లను కూడా దశలవారీగా ఆధునీకరించి.. వాటికి కూడా ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థను అమర్చనున్నట్లు రైల్వే శాఖ వివరించింది. ప్రస్తుతం సేవలో ఉన్న అన్ని డోర్లను రీడిజైన్ చేసి, ముంబై సబర్బన్ లోని ఈ రేక్‌లలో నూతన డోర్ క్లోజర్ సదుపాయం కల్పించనున్నట్టు రైల్వే బోర్డు పేర్కొంది.
ALSO READ: Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో.. ముంబైలోని లోకల్ ట్రైన్ లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్ల ఫుట్ బోర్డులపై నిలబడి ప్రయాణిస్తున్న వారు ఒకరికొకరు తగలడంతో అదుపుతప్పి పది మందికి పైగా కిందపడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు ఆస్పత్రిలో తరలిస్తుండగా మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో మొత్తం 13 మంది కింద పడినట్లు తేలిందని.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.
ALSO READ: Indian Railway Export: ఇది ఇండియన్ రైల్వే సత్తా.. ఆ దేశం రా రమ్మని పాట పాడుతోంది.. ఎందుకంటే?
ముంబై లోకల్ ట్రైన్ లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. రద్దీ సమయాల్లో ట్రైన్ డోర్లు తెరిచే ఉండటం, ఫుట్‌బోర్డు ప్రయాణాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే.. జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థ దోహదపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల రైలు కదిలే ముందు తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పారు. మళ్లీ స్టేషన్ రాగానే.. డోర్లు ఓపెన్ అయితాయని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి సమస్య తలెత్తదని అధికారులు వివరించారు.