BigTV English

Food: హైదరాబాద్‌లో తప్పకుండా వెళ్లాల్సిన ఫుడ్ డెస్టినేషన్స్ ఏంటో తెలుసా?

Food: హైదరాబాద్‌లో తప్పకుండా వెళ్లాల్సిన ఫుడ్ డెస్టినేషన్స్ ఏంటో తెలుసా?

Food: హైదరాబాద్ అంటే కేవలం మెట్రోపాలిటన్ మాత్రమే కాదు, ఆహార ప్రేమికులకు అసలైన హెవెన్. ఇక్కడి సుగంధ బిర్యానీల నుంచి స్ట్రీట్ ఫుడ్, ఇరానీ టీ, శాఖాహార డిలైట్స్ వరకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. సుగంధాలు, కారం, తీపి రుచుల కలయికతో ఈ నగరం ఫుడ్ లవర్స్ గుండెల్ని గెలుచుకుంటుంది. 2025లో హైదరాబాద్‌లో తప్పక ట్రై చేయాల్సిన టాప్ ఫుడ్ స్పాట్స్ గురించి ఓ లుక్కేద్దాం..


పారడైజ్ బిర్యానీ
హైదరాబాద్‌లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చేది పారడైజ్. 1953 నుంచి ఈ రెస్టారెంట్ హైదరాబాదీ బిర్యానీకి ఐకాన్‌గా నిలిచింది. సుగంధ బాస్మతి బియ్యం, మెత్తని మాంసం, రుచికరమైన మసాలాలతో దమ్ బిర్యానీ ఇక్కడ టాక్ ఆఫ్ ది టౌన్. తందూరీ చికెన్, హరాభరా కబాబ్, బటర్ చికెన్ కూడా నోరూరిస్తాయి. కూల్ అంబియన్స్, కన్సిస్టెంట్ క్వాలిటీతో స్థానికులు, టూరిస్టులు ఇక్కడికి తిరుగాడతారు. ఇద్దరికి డిన్నర్ ఖర్చు సుమారు రూ.800 ఉంటుంది. బిర్యానీ లవర్స్‌కి ఇది మస్ట్-విజిట్ స్పాట్.

బావర్చి
‘బిర్యానీ అంటే బావర్చి!’ ఈ డైలాగ్ హైదరాబాదీల మనసులో రూట్ అయిపోయింది. ‘మాకు బ్రాంచ్‌లు లేవు’ అని గర్వంగా చెప్పే బావర్చి, సాంప్రదాయ రుచులకు సిగ్నేచర్. ఇక్కడి బిర్యానీ సుగంధం ఆకలిని డబుల్ చేస్తుంది. సీఫుడ్ స్టార్టర్స్, చికెన్ కర్రీలు, తందూరీ ఐటెమ్స్ కూడా టాప్-నాచ్. పెద్ద పోర్షన్స్, సరసమైన ధరలు బావర్చిని ఫేవరెట్ స్పాట్‌గా చేస్తాయి. డైన్-ఇన్ లేదా టేక్‌అవే, బావర్చి ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు.


కేఫ్ బహార్
హైదరాబాద్ ఫుడ్ కల్చర్‌ని ఫీల్ అవ్వాలంటే కేఫ్ బహార్ మించిన ఆప్షన్ లేదు. ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి దాటే వరకు ఓపెన్‌గా ఉండే ఈ ఇరానీ కేఫ్‌లో దమ్ బిర్యానీ, హలీమ్, కుబానీ కా మీఠా లాంటి సాంప్రదాయ వంటకాలు రుచి చూడొచ్చు. ఇరానీ టీతో ఒస్మానియా బిస్కెట్లు, బటర్ చికెన్ ట్రై చేయకపోతే మిస్ అవుతారు. వైబ్రంట్ వైబ్స్, వాలెట్‌కి ఫ్రెండ్లీ ధరలు ఈ కేఫ్‌ని ఎవర్‌గ్రీన్ స్పాట్‌గా చేస్తాయి. లేట్ నైట్ ఫుడ్ క్రేవింగ్స్‌కి ఇది పర్ఫెక్ట్.

పిస్తా హౌస్
హలీమ్ అంటే పిస్తా హౌస్, పిస్తా హౌస్ అంటే హలీమ్. రంజాన్ సీజన్‌లో ఇక్కడి స్లో-కుక్డ్ మాంసం, లెంటిల్ స్టూ నోటిలో నీళ్లు తెప్పిస్తాయి. జాఫ్రానీ బిర్యానీ, బ్రోస్టెడ్ చికెన్, సౌదీ షాంపైన్ లాంటి డ్రింక్స్ కూడా సూపర్ హిట్. రాయల్ ఇంటీరియర్స్, వైవిధ్యమైన మెనూ ఈ స్పాట్‌ని యూనిక్ చేస్తాయి. చార్మినార్ ఔట్‌లెట్‌లో సాంప్రదాయ రుచులు ఆస్వాదించాలంటే ఇద్దరికి రూ.800 చాలు. హలీమ్ లవర్స్‌కి ఇది మస్ట్ ట్రై.

జల్పాన్
వెజిటేరియన్స్‌కి జల్పాన్ ఒక బెస్ట్ ప్లేస్. శాఖాహార బిర్యానీ, పొట్లీ బిర్యానీ, పనీర్ కర్రీలు, నూడిల్స్, చాట్, డెజర్ట్‌లు ఇక్కడ సూపర్బ్‌గా ఉంటాయి. హాయిగొలిపే అంబియన్స్, స్టైలిష్ ఇంటీరియర్స్ కుటుంబాలకు ఇది ఫేవరెట్ డెస్టినేషన్. ఇద్దరికి ఖర్చు సుమారు రూ.1200, కానీ ప్రీమియం డైనింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇది వర్త్. వెజ్ ఫుడ్ లవర్స్‌కి జల్పాన్ మస్ట్-విజిట్.

స్ట్రీట్ ఫుడ్
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి చార్మినార్ మార్కెట్ గల్లీలు అసలైన ట్రీట్. సీఖ్ కబాబ్‌లు, షామీ కబాబ్‌లు, బోటీ కబాబ్‌లు గ్రిల్‌పై వండిన సుగంధాలు నోరూరిస్తాయి. కీమా సమోసా, మట్టి కుండల్లో ఫిర్నీ కూడా మస్ట్-ట్రై. గోల్కొండ కోట దగ్గర కీమా సమోసాలు కూడా సూపర్ ఫేమస్. రూ.100 లోపే ఈ రుచులు ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ వైబ్‌ని ఫీల్ అవ్వాలంటే ఇక్కడకు వెళ్లాల్సిందే.

రామ్ కీ బండి
మధ్యరాత్రి ఆకలి కొడితే రామ్ కీ బండి దోశ లవర్స్‌కి బెస్ట్ ఆప్షన్. ఉదయం 3 నుంచి 6 గంటల వరకు ఓపెన్‌గా ఉండే ఈ స్టాల్‌లో బటర్ చీజ్ దోశ, పిజ్జా దోశ, మసాలా టోస్ట్ దోసెలు రుచి చూడొచ్చు. జన సందడి, ఎనర్జిటిక్ వైబ్స్ ఈ అనుభవాన్ని మరింత స్పెషల్ చేస్తాయి. రూ.1000లోపే మధ్యరాత్రి దోశ ఫీస్ట్ ఎంజాయ్ చేయొచ్చు.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×