Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… కొత్త కుర్రాడు వైభవ్ సూర్య వంశీ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల ఈ వైభవ్ సూర్య వంశీ… రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ… దుమ్ము లేపుతున్నాడు. ముఖ్యంగా సంజు స్థానంలో జట్టులోకి వచ్చి తన స్థానాన్ని సుస్థిరంగా మార్చుకున్నాడు ఈ కుర్రాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ గా తన స్థానాన్ని.. ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అయితే తాజాగా ఓ సెంచరీ చేసి మరింత జనాలకు దగ్గర అయిపోయాడు ఈ కుర్రాడు.
Also Read: Ben Cutting – RCB: ఆ రాక్షసుడు వస్తున్నాడు..రోజుకు 150 మెసేజ్ లు..ఇక RCBకి పీడకలే
35 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్య వంశీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. గత 20 రోజుల కిందట గుజరాత్ టైటాన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ జట్టును ఉతికి ఆరేశాడు ఈ 14 సంవత్సరాల కుర్రాడు. కేవలం 35 బంతుల్లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు పైన సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు ఈ 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఇదే అతి వేగంగా చేసిన సెంచరీ. అంతకుముందు క్రిస్ గేల్ ఫాస్ట్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సాధించాడు.
500 ఫోన్ కాల్స్.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదుగా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో 35 బంతుల్లో సెంచరీ చేసిన రోజున వైభవ్ సూర్య వంశీకి చాలామంది ఫోన్ చేశారట. ఆరోజున దాదాపు 500 ఫోన్ కాల్స్ వచ్చినట్లు… స్వయంగా వైభవ్ సూర్యవంశీ తాజాగా పేర్కొనడం జరిగింది. ఇందులో తన సీనియర్లు… జూనియర్లు, కోచులు, కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది లేడీస్ కూడా తనకు ఫోన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇలా 500 కు పైగా… ఫోన్ కాల్స్ రావడంతో… నాలుగు రోజులపాటు ఫోన్ స్విచ్ ఆఫ్… చేసినట్లు కూడా వైభవ్ సూర్య వంశీ చెప్పడం జరిగింది.
గతంలో అనేక ఇబ్బందులు తాను లైఫ్ లో పడ్డానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. తాను తన కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో ఎక్కువగా ఉండటానికి ఎంతో ఇష్టపడతానని వివరించాడు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ తనకు చాలా కలిసి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ అలాగే వివిఎస్ లక్ష్మణ్ కారణంగా తాను ఈ స్థాయికి వచ్చినట్లు స్పష్టం చేశాడు. ఇక అటు… పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా…. 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాను వైభవ్ సూర్య వంశీ హగ్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. అయితే ఈ ఫోటో వైరల్ కావడంతో వెంటనే ప్రీతిజింటా స్పందించడం జరిగింది. అలాంటి సంఘటన ఏమి జరగలేదని… హగు కాదు కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చానని పేర్కొంది.
Also Read: Nita Ambani: 6వ ట్రోఫీ అంటూ సిగ్నల్స్.. గెలిచాక ముంబై ప్లేయర్లను అవమానించిన నీతా అంబానీ