E-Paper
Advertisement

రైలు అద్దం నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాయి.. దురంతోపై దాడి? ఇదిగో ఆ షాకింగ్ వీడియో!

రైలు అద్దం నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాయి.. దురంతోపై దాడి? ఇదిగో ఆ షాకింగ్ వీడియో!
Advertisement

Stone Pelting on Duronto Express: మహారాష్ట్ర లో నాగ్‌ పూర్-ముంబై సీఎస్ఎంటీ దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి కలకలం రేపింది. రైలు బోర్ఖేడి స్టేషన్‌ను దాటిన కొద్దిసేపటికే బయట నుంచి రాళ్లు విసరడంతో మూడు కోచ్‌ల కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. సెప్టెంబర్ 25 రాత్రి జరిగిన ఈ ఘటనపై రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు రంగంలోకి దిగాయి.

రాత్రి 8:27 గంటలకు ఘటన!

నాగ్‌పూర్ నుంచి ముంబై సీఎస్ఎంటీ వైపు వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ (12290) బోర్ఖేడి స్టేషన్‌ను దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. రాత్రి సుమారు 8:27 గంటల సమయంలో రైలుపై బయట నుంచి రాళ్లు, ఇతర వస్తువు విసిరినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏ-1, బి-2, బి-5 కోచ్‌లకు చెందిన కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ప్రయాణికులు ఉన్న సమయంలోనే ఘటన జరిగినప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చే విషయం. ఈ ఘటనపై రైల్వే సిబ్బందికి రాత్రి 8:46 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే ఆర్పీఎఫ్, ప్రభుత్వ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. బోర్ఖేడి-సింధీ రైల్వే సెక్షన్‌లోని ట్రాక్ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. సుమారు 803వ కిలోమీటర్ నుంచి 796వ కిలోమీటర్ మధ్య ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.

నిందితుల కోసం గాలింపు

Advertisement

ఘటనా స్థలంలో అనుమానాస్పద వ్యక్తులు వెంటనే కనిపించలేదు. అయినప్పటికీ, పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు. రైల్వే ఆస్తులకు, ప్రయాణికులకు ప్రమాదం కలిగించే చర్యలను అరికట్టేందుకు అధికారులు పరిసర ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్నారు. దాడి ఏ ప్రాంతం నుంచి జరిగిందనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదే మార్గంలో గతంలోనూ ఘటనలు

ఈ మార్గంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో రాళ్ల దాడికి సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా కేసును కూడా పోలీసులు సీరియస్‌ గా తీసుకున్నారు. రైళ్లపై రాళ్లు విసరడం వల్ల కిటికీలు మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తులను గుర్తించి, పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Read Also: 350 కిమీ వేగంతో భారత బుల్లెట్ రైలు.. జపాన్ E10కు పోటీగా B35 రెడీ!

Tags

Related News

పండుగ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖకు ప్రత్యేక రైళ్లు!

భారతీయులకు ఉచిత వీసా ఇస్తున్న మలేషియా.. కానీ ఉద్యోగం చేయాలంటే ఈ కండీషన్స్ తప్పనిసరి

దసరా, దీపావళికి రైల్వే గుడ్‌న్యూస్.. 102 స్పెషల్ రైళ్లు!

బర్త్ టూరిజానికి గట్టి భారీ షాక్.. అమెరికా కొత్త వీసా రూల్స్!

రైలులో సైకో కిల్లర్.. ఖాకీ దుస్తుల్లో వచ్చి డ్రామాలు.. ప్రయాణికులను బయటకు తోసేస్తూ దారుణాలు!

ఏంటీ ఈ బుల్లి పాకెట్ వెనుక.. 150 ఏళ్ల చరిత్ర ఉందా? పైగా కాయిన్స్ కోసం కాదా!

రైల్వే బోర్డులు పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా? ఆశ్చర్యపరిచే నిజాలు!

Big Stories

Advertisement
×