Bengaluru Railway Station: సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు ప్రయాణీకులు కీలకమైన అలర్ట్ జారీ చేశారు. మార్చి 5 నుంచి బెంగళూరులోని రైల్వే స్టేషన్ ను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రోజు వారీ ప్రయాణాలు చేసే ప్యాసింజర్లు ప్రత్యామ్నాయ బోర్డింగ్, డీబోర్డింగ్ పాయింట్లను చూసుకోవాలని సూచించారు.
మార్చి 5 నుంచి బెంగళూరు రైల్వే స్టేషన్ క్లోజ్
సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఆపరేషనల్ ఛేంజెస్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు ఆగవని తెలిపారు. రీసెంట్ గానే ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు కొద్ది రోజుల పాటు ఇతర మార్గాలను ఎంచుకోవాలన్నారు.
బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో ఆగని రైళ్లు
బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో ఆగని రైళ్ల వివరాలను ఇప్పటికే సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంతకీ ఆ స్టేషన్ లో ఆగన రైళ్లే ఏవంటే..
⦿ రైలు నంబర్ 12614 – బెంగళూరు – చెన్నై ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 12607 – చెన్నై – బెంగళూరు లాల్ బాగ్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 16219/16220 – చామరాజనగర్ – తిరుపతి ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 16515/16516 – యశ్వంత్ పూర్- కార్వార్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 16585/16586 – యశ్వంత్ పూర్-మంగళూరు ఎక్స్ ప్రెస్
ఈ రైళ్లు మార్చి 5 నుంచి బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో ఆగవని ఇండియన్ రైల్వే వెల్లడించింది.
బెంగళూరు తూర్పు స్టేషన్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే?
బెంగళూరు తూర్పు స్టేషన్ దగ్గర ఆపరేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రద్దీని తగ్గించడం కోసం కొద్ది రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్టేషన్ లో గత కొంత కాలంగా ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తుంది. అయితే, రైల్వే అధికారులు చేసే సర్దుబాట్ల కారణంగా ఈ ప్రాంతంలో రైలు కదలికను క్రమబద్ధీకరించడానికి సహాయపడనున్నాయి.
Read Also: నడి సంద్రంలో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యాలా? ఈ షిప్పులో ‘అన్నీ’ చేసుకోవచ్చట!
బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్ క్లోజ్.. ప్రయాణీకులు ఏం చేయాలంటే?
బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ కొద్ది రోజుల పాటు క్లోజ్ కానున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణీకులకు కీలక విషయాలను వెల్లడించారు. ముందుగా ప్రయాణీకులు బోర్డింగ్ పాయింట్ ను తనిఖీ చేసుకోవాలి. నైరుతి రైల్వే వెబ్ సైట్ లేదంటే NTES యాప్ లో షెడ్యూల్ లను కన్ఫర్మ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేసే ప్యాసింజర్లు కొత్త బోర్డింగ్, డీబోర్డింగ్ స్టేషన్లను సెలెక్ట్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్ తిరిగి ఓపెన్ అయ్యే వరకు ఇదే పద్దతిని ఫాలో కావాలని అధికారులు సూచించారు.
Read Also: అందుబాటులోకి వాటర్ మెట్రో.. మీరూ ఓసారి జర్నీ చేసేయండి!
Read Also: భారత్ నుంచి ఆ అందాల లోకానికి కొత్త రైల్వేలైన్, ఎన్ని లాభాలో తెలుసా?