Power bank fire Flight: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో విమానాలు ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందకు దిగొస్తున్న ఘటనలు ప్రయాణికులను వెంటాడుతున్నాయి. తాజాగా క్యాబిన్‌లో పవర్ బ్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అలర్టయిన క్యూ సిబ్బంది, పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో అత్యవసరంగా విమానం ల్యాండ్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సెప్టెంబర్ 17న ఆమ్‌స్టర్‌డామ్ నుండి కురాకోకు వెళ్తున్న KLM విమానం బయలుదేరింది. ప్రయాణికులు తమ క్యాబిన్‌లో సామాన్లు పెట్టుకున్నారు. అయితే పవర్ బ్యాంక్‌కు మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు విమానం భూమికి వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. పైనున్న లగేజీ కంపార్ట్‌మెంట్ నుండి మంటలు, పొగ రావడం కనిపిస్తుండగా ప్రయాణికులు భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు.
దీంతో క్యాబిన్ చుట్టూ పొగలు అలముకున్నాయి. కొంతమంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా విమానంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఆ మంటలను ఆర్పడానికి సహాయపడే వస్తువు కోసం ప్రజలు విమానం లోపల పరుగులు తీశారు. కానీ అవేమీ కంట్రోల్ కాలేదు. పైలట్లకు కేబిన్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. KLM విమానం అట్లాంటిక్ మీదుగా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది.
చివరకు మంటలను సిబ్బంది ఆర్పివేశారు, ఈ ఘటనతో విమానం కాస్త డ్యామేజ్ అయ్యింది. చివరకు ఆ విమానం రాత్రి సుమారు 8.40 గంటలకు ల్యాండైంది. ప్రయాణికులు తాము బయలుదేరిన చోటికి తిరిగి రావడం, గంటల తరబడి గాలిలోనే గడిపారు. పవర్ బ్యాంక్ వల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆ పరికరం KLM మాజీ అధ్యక్షుడు, CEO కామియెల్ యూర్లింగ్స్‌కు చెందినదని పలువురు ప్రయాణికులు డచ్ మీడియాకు వెల్లడించారు.
చివరకు ఎయిర్ పోర్టులో విమానం ల్యాండింగ్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చిన్న లిథియం బ్యాటరీ విమానంలో చాలా పెద్ద సమస్యను సృష్టించగలదు అనేది ఘటనకు ఇదొక ఎగ్జాంఫుల్. లిథియం-అయాన్ బ్యాటరీలు దెబ్బతిన్నప్పుడు అధిక వేడికి గురై షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెబుతున్నారు. అవి తీవ్రమైన వేడిని విడుదల చేసినప్పుడు మంటలు ఆరిపోయినట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత తిరిగి మండే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
విమానం ట్రావెలింగ్ సమయంలో ప్రయాణికులు పవర్ బ్యాంక్‌లను ఉపయోగించడాన్ని లేదా ఛార్జ్ చేయడాన్ని KLM ప్రత్యేకంగా నిషేధిస్తుంది. ఆ ఎయిర్‌లైన్ ప్రయాణికులను పవర్ బ్యాంక్‌లను తీసుకువెళ్లడానికి అనుమతిస్తుంది. అవి తప్పనిసరిగా చేతి బ్యాగులో ఉండాలి, అందుబాటులో ఉంచుకోవాలి. వాటిని ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లో పెట్టకూడదు. తాజా ఘటన వల్ల ప్రభావితమైన 322 మంది ప్రయాణికులకు KLM వసతి ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులు మరుసటి రోజు మరో విమానంలో కురాకోకు విమానం ఏర్పాటు చేసింది సదరు ఎయిర్ లైన్స్.
ALSO READ: విమానంలో జ్యోతిర్లింగాల యాత్ర.. షిర్డీ, ఎల్లోరా కూడా!
This is how serious a fire incident can look inside an aircraft while cruising thousands of feet above the ground. Flames and smoke are seen coming from the overhead luggage compartment as passengers scream, panic spreads, and people scramble to find anything that can help… pic.twitter.com/GOGWnzZ98L
— Aviation Reporter (@TripppleSeven7) September 19, 2026