E-Paper
Advertisement

వాగన్ఆర్ To ఎలక్ట్రిక్ MPV.. మారుతి నుంచి రాబోతున్న 4 క్రేజీ ఫ్యూచర్ కార్లు ఇవే!

వాగన్ఆర్ To ఎలక్ట్రిక్ MPV..  మారుతి నుంచి రాబోతున్న 4 క్రేజీ ఫ్యూచర్ కార్లు ఇవే!
Advertisement

Maruti Suzuki’s New Car Lineup: భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకికి మరింత దూకుడుగా వెళ్తోంది. చిన్న కార్ల నుంచి SUVల వరకు సూపర్ మోడల్ లైనప్ ఉన్న కంపెనీ.. ఇప్పుడు కొత్త సెగ్మెంట్లపై కూడా దృష్టి పెడుతోంది. ఇప్పటికే బ్రెజ్జా, బాలెనో, స్విఫ్ట్, డిజైర్ లాంటి మోడళ్లలో అప్‌డేట్లు తీసుకొచ్చిన మారుతి.. మరో నాలుగు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. వీటిలో కొత్త వాగన్ఆర్, మూడు వరుసల SUV, ఎలక్ట్రిక్ MPV, చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్  ఉన్నాయి.

YMC

మారుతి ప్రస్తుతం భారత మార్కెట్లో ఇ-విటారాను మాత్రమే ఎలక్ట్రిక్ వెర్షన్ లో అమ్ముతోంది. ఇప్పుడు అదే టెక్నాలజీ ఆధారంగా YMC పేరుతో కొత్త ఎలక్ట్రిక్ MPVని తయారు చేస్తోంది. ఇది మూడు వరుసల సీట్లతో 7 మంది ప్రయాణించేలా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 4.5 మీటర్ల పొడవుతో ఉండే ఈ MPVలో పెద్ద క్యాబిన్, ఫ్లాట్ ఫ్లోర్, పెద్ద టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్ లాంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా. ఇ-విటారాలో ఉన్న 49kWh, 61.1kWh బ్యాటరీలలో ఏదో ఒకదాన్ని YMCలో ఉపయోగించే అవకాశం ఉంది.

కొత్త వాగన్ ఆర్

Advertisement

మారుతి వాగన్ ఆర్‌ కు కూడా త్వరలో కొత్త అప్‌డేట్ రానుంది. ఇప్పటికే రోడ్లపై టెస్ట్ వెహికల్స్ కనిపించడంతో కొత్త మోడల్  అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. టాల్‌ బాయ్ డిజైన్‌ను కొనసాగిస్తూనే గ్రిల్, బంపర్లు, లైటింగ్, వీల్స్‌ లో మార్పులతో వచ్చే అవకాశం ఉంది. లోపల కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేట్ చేసిన డ్యాష్‌ బోర్డ్, కొత్త అప్‌హోల్స్టరీ లాంటి మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త 1.2 లీటర్, 3-సిలిండర్ Z-సిరీస్ ఇంజిన్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది. CNG వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESP లాంటి భద్రతా ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

Y17

గ్రాండ్ విటారా ఆధారంగా Y17 కోడ్‌ నేమ్‌ తో మూడు వరుసల SUVని మారుతి తయారు చేస్తోంది. 2026 చివరలో లేదంటే  2027 ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది.  పొడవైన బాడీ, ఎక్కువ వీల్‌ బేస్‌ తో మూడో వరుస ప్రయాణికులకు మరింత ప్లేస్ కల్పించేలా దీన్ని రూపొందించనున్నారు. 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్‌అప్ డిస్‌ప్లే, TPMS, లెవల్ 2 ADAS లాంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా. 1.5 లీటర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లతో పాటు CNG ఆప్షన్ కూడా రావచ్చని తెలుస్తోంది.

చిన్న ఎలక్ట్రిక్ కారు

Advertisement

మారుతి మరో చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్‌ను కూడా తయారు చేస్తోంది. విజన్ ఇ-స్కై కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఈ కారు.. కంపెనీ నుంచి తక్కువ ధరకు లభించే EV కానుంది. సుమారు 3.39 మీటర్ల పొడవుతో ఉండే ఈ కారు K-EV ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుందని తెలుస్తోంది. 29kWh బ్యాటరీతో దాదాపు 270 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వొచ్చని అంచనా.

Read Also: టిగోర్ స్థానంలో టాటా ఏరిస్.. డిజైర్, అమేజ్‌ కు గట్టి పోటీ తప్పదా?

Tags

Related News

టాటా To మహీంద్రా.. భారత మార్కెట్ లోకి అడుగు పెట్టనున్న 5 ఈవీలు ఇవే!

మైలేజీ ఎక్కువ.. ఖర్చు తక్కువ.. 5 బెస్ట్ బడ్జెట్ స్కూటర్లు ఇవే!

కేరెన్స్, క్లావిస్‌ కు CNG పవర్.. ధరలు ఎంతో తెలుసా?

మైలేజీకి మారుతి కొత్త ప్లాన్.. బాలెనో CNG-AMT వచ్చేసింది!

టిగోర్ స్థానంలో టాటా ఏరిస్.. డిజైర్, అమేజ్‌ కు గట్టి పోటీ తప్పదా?

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×