AP to Puri Train List: ఏపీ మీదుగా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే భారీ ప్రకటన చేసింది. దీనితో ఎందరో రైల్వే ప్రయాణికులకు మేలు చేకూరనుంది. ఇంతకు ఈ రైళ్ల సంఖ్య ఇంతలా ఉండడం వెనుక ఉన్న అసలు మర్మం తెలుసుకుంటే ఔరా అనేస్తారు. అంతేకాదు భక్తితో ఇండియన్ రైల్వే కు నమస్కరిస్తారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే..
రథ చక్రాల చప్పుడు, భక్తుల కీర్తనలు, పూరీ జగన్నాథుని తులసిదళ వాసన.. ఇవన్నీ ఒక్కసారి అనుభవిస్తే జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర పండుగకు సంవత్సరానికి ఒకసారి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివెళ్తారు. ఎండ, వాన, దూరం అన్నీ మర్చిపోయి, కేవలం భక్తితో నిండిన గుండెతో ప్రయాణించే వీరికి ఇప్పుడు తూర్పు తీర రైల్వే (East Coast Railway) చక్కటి రైలు మార్గం అంకితమిస్తోంది.
పండుగకు దగ్గరగా రద్దీ పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి తూర్పు తీర రైల్వే 365 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇది గత సంవత్సరం నడపబడిన 315 ప్రత్యేక రైళ్ల కంటే ఎక్కువ. ప్రయాణికుల రద్దీని తేలికపర్చడమే కాకుండా, దూర ప్రాంతాల నుంచీ వచ్చిన భక్తులకు నిరంతర ప్రయాణ అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ భారీ ఏర్పాటు చేపట్టింది.
ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా పూరీకి వెళ్తూ భక్తుల బాటను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా విశాఖపట్నం, పలాస వంటి స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్, గోండియా, పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి (కోల్‌కతా) నుంచీ కూడా రైళ్లు నడవనున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే వారంతా ఏపీ మీదుగా సాగుతూ పూరీకి చేరుకోగలుగుతారు.
ఒడిశాలోని రూర్కెలా, బిరమిత్రపూర్, బంగిరిపోసి, జునాగఢ్ రోడ్, బాదంపహార్, బౌధ్, బాలేశ్వర్, అంగుల్, గుణుపూర్, రాయగడ వంటి పట్టణాల నుంచీ కూడా ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతున్నాయి. పండుగ ప్రధాన రోజులలో విశాఖపట్నం, గోండియా, సంత్రాగచ్చి వంటి ప్రాంతాల నుంచి ప్రత్యక్ష సేవలు కూడా నడవనున్నాయి. ఈ భారీ ఏర్పాట్లు పూరీ రథయాత్రను సందర్శించాలనుకునే లక్షలాది భక్తులకు ఎంతో ఉపశమనం కలిగించబోతున్నాయి.
Also Read: Hyderabad to Tirupati: హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్నారా? ఈ రూట్ వెరీ షార్ట్ కట్ గురూ!
ఈ రైళ్లు సాధారణ రైళ్లకు అదనంగా నడుస్తూ, ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉండేలా ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులు తమ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి, టికెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తూర్పు తీర రైల్వే సూచించింది.
అంతేకాదు, పండుగ సమీపిస్తున్న కొద్దీ ప్రయాణికులకు మరింత సమాచారం అందించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటనలు చేయనుంది. మారుమూల గ్రామాల నుండి వస్తున్న భక్తులకు, లోపలిన ప్రాంతాల ప్రజలకు కూడా పూరీ చేరేందుకు ఈ ప్రత్యేక రైళ్లు అద్భుతమైన అవకాశం.
ఇంత ప్రణాళికతో, సౌకర్యాలతో పూరీకి వెళ్లే భక్తులకు ఈ ప్రత్యేక రైళ్లు స్నేహితుల్లాంటి సేవను అందించనున్నాయి. ఏపీలోని విశాఖ, పలాస వంటి స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడవడం, తెలుగువారికి మరింత సౌకర్యాన్ని తీసుకురాబోతోంది. ఇది కేవలం రైలు ప్రయాణం కాదు… భక్తి మార్గంలో పదుల కిలోమీటర్ల ప్రయాణాన్ని సమయంతో, భద్రతతో, విశ్రాంతితో నడిపించే ఒక విశేష ఏర్పాటేనని చెప్పవచ్చు.