Train News: బంగ్లాదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఒక రైలు ప్రయాణంలో ఊహించని సమస్య ఎదురైనప్పుడు, సిబ్బంది తెలివిగా, సృజనాత్మకంగా ఆలోచించి సమస్యను పరిష్కరించడానికి భవిష్యత్తులో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచిపోతుంది. రైలు హెడ్‌లైట్ పనిచేయకపోవడం వల్ల రాత్రి సమయంలో పట్టాలపై దారి చూసుకోవడం కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ, రైలు సిబ్బంది, ప్రయాణీకులు కలిసి మొబైల్ ఫోన్‌లలోని ఫ్లాష్‌లైట్లను ఉపయోగించి, రైలును సురక్షితంగా 8 కిలోమీటర్ల దూరం నడిపించంటే వారిని గ్రేట్ అనే చెప్పవచ్చు. పూర్తి వివరాలు చూద్దాం.
ఢాకా నుంచి బ్రహ్మన్ బారియాలోని అఖౌరాకు వెళ్తున్న కమ్యూటర్ రైలు ఇంజిన్ హెడ్ లైట్ నిన్న రాత్రి పనిచేయలేదు. ఒక్కసారిగా లైటింగ్ వ్యవస్థ దెబ్బతింది. రాత్రి సమయంలో లైటింగ్ లేకుండా రైలు నడపడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే రైలు డ్రైవర్‌కు ముందు ఉన్న పట్టాలు, అడ్డంకులు, సిగ్నల్స్ స్పష్టంగా కనిపించవు. అయినా దాదాపు ఎనిమిది కిలోమీటర్లు చీకటిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. చాలా మంది ప్రయాణీకుల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్లాష్‌లైట్ ఫీచర్‌ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అసాధారణమైన పరిస్థితిలో.. రైల్వే సిబ్బంది, ప్రయాణికులు మొబైల్ ఫోన్ టార్చిలైట్ల సాయంతో ట్రైన్ ముందుకు కదిలింది. ప్రయాణీకులు తమ ఫోన్‌ల ఫ్లాష్‌లైట్లను ఆన్ చేసి, రైలు ముందు భాగంలో ఉంచారు. సిబ్బంది సూచనల మేరకు వాటిని రైలు ఇంజన్ దగ్గర ఏర్పాటు చేశారు.
ALSO READ: Arrowhead Tiger: అడవినే దడపుట్టించిన ఆరోహెడ్ టైగర్ ఇక లేదు.. చివరి వీడియో వైరల్
ఈ మొబైల్ లైటింగ్ వ్యవస్థతో, రైలు డ్రైవర్ చాలా నెమ్మదిగా.. జాగ్రత్తగా.. రైలును ముందుకు నడిపారు. ఫ్లాష్‌లైట్లు హెడ్‌లైట్‌లు ఫెయిల్ అవ్వడంతో.. మొబైల్ ఫోన్ల సాయంతో ట్రైన్ ముందుకు సాగింది. ఈ విధంగా, రైలు సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సమీపంలోని స్టేషన్‌కు లేదా సురక్షితమైన ప్రదేశానికి విజయవంతంగా చేరుకుంది. ఈ ప్రయాణంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంది. రైలు తక్కువ వేగంతో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే సిగ్నల్స్, పట్టాలపై ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అని నిరంతరం పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రయాణీకులు కూడా సహకరించి, సిబ్బంది సూచనలను ఖచ్చితంగా పాటించారు.
ALSO READ: Viral video: థాయిలాండ్‌కు వెళ్లిన భారత పర్యాటకులు ఇలా చేశారేంటి? వీడియో వైరల్..
బ్రహ్మన్ బారియా జిల్లాలోని అషుగంజ్ ఏరియా ఉన్న తల్షహర్ రైల్వే స్టేషన్‌ను దాటిన తర్వాత ఈ సమస్య తలెత్తిందని బ్రహ్మన్ బారియా రైల్వే స్టేషన్ మాస్టర్ ఎండీ జాసీమ్ ఉద్దీన్ తెలిపారు. లోకోమోటివ్ హెడ్‌లైట్ పనిచేయకపోవడంతో.. రైల్వే సిబ్బంది మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించి బ్రహ్మన్‌బారియా రైల్వే స్టేషన్ వైపు రైలును నడిపించారని ఆయన వివరించారు. ఊహించని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, సృజనాత్మకంగా ఆలోచించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన చూపిస్తుంది. సిబ్బంది, ప్రయాణీకుల మధ్య సమన్వయంతో ఈ ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేవారు. సాధారణ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ అయిన ఫ్లాష్‌లైట్ అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుందని రుజువైంది.ఇలాంటి సంఘటనలు మనకు అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో ఆలోచించడం యొక్క విలువను తెలియజేస్తాయి.