E-Paper
Advertisement

LNG రైలు vs హైడ్రోజన్ రైలు.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!

LNG రైలు vs హైడ్రోజన్ రైలు.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!
Advertisement

LNG vs Hydrogen Train: భారతీయ రైల్వేలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై ప్రయోగాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27న దేశంలో తొలి లిక్విడ్ నేచురల్ గ్యాస్ (LNG) డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ రైలును గుజరాత్‌ లోని సబర్మతి నుంచి పట్టాలెక్కింది. అంతకుముందు జూలైలో దేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా రైల్వే ప్రారంభించింది. రెండు రైళ్ల లక్ష్యం డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే అయినా.. అవి పనిచేసే విధానం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

LNG రైలు ఎలా పనిచేస్తుంది?

దేశంలో ప్రారంభించిన LNG రైలు పూర్తిగా LNGతో నడిచేది కాదు. ఇందులో డీజిల్–LNG డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ ను ఉపయోగించారు. రైలులోని రెండు 1,400 హార్స్‌ పవర్ డ్రైవింగ్ పవర్ కార్లను ఈ విధానానికి అనుగుణంగా మార్చారు. సింపుల్  గా చెప్పాలంటే.. ఇంజిన్‌లో సాధారణంగా ఉపయోగించే డీజిల్‌లో కొంత భాగాన్ని LNG భర్తీ చేస్తుంది. LNGని ద్రవ రూపంలో ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేసి, డీజిల్‌తో కలిసి ఇంజిన్‌కు అందిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతం వరకు LNGతో ఫిల్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రయల్ డేటా ఆధారంగా ఇంధన ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని రైల్వే అంచనా వేస్తోంది.

హైడ్రోజన్ రైలుతో పోల్చితే తేడా ఏంటి?   

Advertisement

హైడ్రోజన్ రైలులో మాత్రం డీజిల్, LNGని బర్న్ చేసి శక్తిని ఉత్పత్తి చేయరు. ఇందులో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. రైలులో నిల్వ చేసిన హైడ్రోజన్‌ను గాలిలోని ఆక్సిజన్‌తో ఫ్యూయల్ సెల్స్‌ లో కెమికల్ రియాక్షన్ కు గురిచేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్తు బ్యాటరీలు, ట్రాక్షన్ వ్యవస్థకు చేరి రైలును నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో టెయిల్‌ పైప్ నుంచి నేరుగా కార్బన్ ఉద్గారాలు రావు. నీటి ఆవిరి ఏర్పడుతుంది.

పవర్‌లోనూ తేడా!

హైడ్రోజన్ రైలులో ఇరువైపులా ఉన్న రెండు పవర్ కార్లు ఒక్కొక్కటి 1,200 కిలోవాట్ల శక్తిని అందించేలా రూపొందించారు. ఈ వ్యవస్థతో రైలు గంటకు 110 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుంది. LNG రైలులో మాత్రం ఇప్పటికే ఉన్న ఇంటర్నల్ కంబన్షన్ ఇంజిన్ వ్యవస్థనే ఆధారంగా తీసుకుని దానిని డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీకి మార్చారు. అంటే, ఇక్కడ ప్రధాన మార్పు ఇంధన వినియోగంలో ఉంటుంది.

ఉద్గారాల్లో అసలు తేడా!

Advertisement

LNG కూడా సహజ వాయువే అయినప్పటికీ,  హైడ్రోకార్బన్ కావడంతో దహనం సమయంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. అయితే, డీజిల్‌లో కొంత భాగాన్ని LNGతో భర్తీ చేయడం వల్ల CO₂తో పాటు నైట్రోజన్ ఆక్సైడ్లు, పార్టిక్యులేట్ మ్యాటర్ లాంటి ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది.  హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వ్యవస్థలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి సమయంలో కార్బన్ ఆధారిత టెయిల్‌పైప్ ఉద్గారాలు ఉండవు.

LNG అవసరం ఎందుకు?

LNG, హైడ్రోజన్ రెండింటినీ ఒకే తరహా టెక్నాలజీగా చూడలేం. LNGను ఉపయోగించడం ద్వారా ప్రస్తుత డీజిల్ ఆధారిత రైళ్లలో కొంత భాగాన్ని ప్రత్యామ్నాయ ఇంధనానికి మార్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉండదు. హైడ్రోజన్ రైళ్లకు మాత్రం ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ లాంటి కొత్త మౌలిక సదుపాయాలు అవసరం. అంటే సాంకేతికంగా డిఫరెంట్ ప్రొపల్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అందుకే LNG, హైడ్రోజన్ రైళ్లను ఒకదానికొకటి నేరుగా ప్రత్యామ్నాయాలుగా చూడటం కంటే.. డీజిల్‌ పై ఆధారపడటాన్ని తగ్గించే రెండు వేర్వేరు మార్గాలుగా చూడొచ్చు.

Read Also: డీజిల్ ఖర్చు తగ్గించేందుకు రైల్వే కొత్త ప్లాన్.. ఫస్ట్ LNG రైలు వచ్చేసింది!

Tags

Related News

డీజిల్ ఖర్చు తగ్గించేందుకు రైల్వే కొత్త ప్లాన్.. ఫస్ట్ LNG రైలు వచ్చేసింది!

నిందితుల కోసం కదులుతున్న కారుపైకి దూకిన పోలీస్.. ఏకంగా 40 కిలో మీటర్లు కళ్లు చెదిరే ఛేజ్!

బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!

గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!

కొరియాలో పార్సిల్స్ టేప్స్ మీద పిల్లల ఫోటోస్ ఎందుకు ఉంటాయో తెలుసా? భలే ఐడియా!

నార్మల్ ప్యాసింజర్ లా వెళ్తూ.. రైలులో సివిక్ సెన్స్ లేని వాళ్లకి మొట్టికాయలు వేసిన ఆదా శర్మ!

కదిలే రైల్లో అదిరిపోయే కేఫే.. వేడి కాఫీ తాగుతూ వెళ్తుంటే ఆ కిక్కే వేరప్పా!

Big Stories

Advertisement
×