E-Paper
Advertisement

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?
Advertisement

Machilipatnam–Kurnool Express: ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు మరో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. మచిలీపట్నం నుంచి కర్నూలు వరకు విజయవాడ మీదుగా వారానికి మూడు రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్‌ ప్రెస్ సర్వీసుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. దీంతో కోస్తా ఆంధ్ర, పల్నాడు, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణికుల రాకపోకలకు మరో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.

499 కిలోమీటర్ల ప్రయాణం!

కొత్తగా ప్రతిపాదించిన మచిలీపట్నం–కర్నూలు సిటీ ఎక్స్‌ ప్రెస్ మొత్తం 499 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది. మచిలీపట్నం నుంచి సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9:35 గంటలకు మచిలీపట్నం చేరుకునేలా సర్వీసును రూపొందించారు.

వారానికి మూడు రోజులు!

Advertisement

ఈ రైలు మచిలీపట్నం నుంచి సోమవారం, బుధవారం, శనివారం నడవనుంది. కర్నూలు నుంచి తిరుగు సర్వీసు మంగళవారం, గురువారం, ఆదివారం కొనసాగుతుంది. దీంతో వారంలో ఆరు రోజులు ఈ మార్గంలో రైలు సర్వీసు అందుబాటులో ఉండనుంది.

ఏ స్టేషన్లలో ఆగుతుందంటే?

ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా పలు కీలక స్టేషన్లలో ఈ ఎక్స్‌ ప్రెస్‌ కు స్టాపేజీలు ఏర్పాటు చేశారు. గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, డోనకొండ, మార్కాపూర్ రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచర్ల, ధోన్ స్టేషన్లలో రైలు ఆగనుంది. మచిలీపట్నం నుంచి కర్నూలు వరకు ప్రయాణించే వారితో పాటు మధ్యలోని పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ సర్వీసు ఉపయోగపడనుంది.

సరుకు రవాణాకు రూ.122 కోట్ల ప్రాజెక్టు!

Advertisement

అటు ప్రయాణికుల రైలు సర్వీసుతో పాటు సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా రైల్వే కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని బార్బిల్–బోలనీఖడాన్ మధ్య 6 కిలోమీటర్ల మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చేందుకు రూ.122 కోట్ల ప్రాజెక్టును ఆమోదించారు. ఈ పనులు పూర్తయితే ఏటా అదనంగా 8.9 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసే అవకాశం ఏర్పడుతుందని అంచనా. ప్రస్తుతం సింగిల్ లైన్‌గా ఉన్న ఈ మార్గంలో ఏటా దాదాపు 9 మిలియన్ టన్నుల సరుకు రవాణా అవుతోంది. రోజుకు సుమారు ఆరు లోడెడ్ ఐరన్ ఓర్ రేక్‌లు ఈ మార్గం నుంచి బయలుదేరుతున్నాయి.

కవచ్ 4.0కు రూ.223 కోట్లు!

రైళ్ల భద్రతను పెంచే దిశగా కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈశాన్య రైల్వేలోని వారణాసి డివిజన్ పరిధిలో 614.75 కిలోమీటర్ల మార్గంలో కవచ్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ.223 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.

Read Also: పండుగ రద్దీ వేళ రైల్వే గుడ్‌న్యూస్.. పలు రైళ్లకు అదనపు కోచ్‌లు!

Tags

Related News

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

పండుగ రద్దీ వేళ రైల్వే గుడ్‌న్యూస్.. పలు రైళ్లకు అదనపు కోచ్‌లు!

రైలు టికెట్ ఉంటే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాల్సిందే!

పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు.. దసరా వేళ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్!

LNG రైలు vs హైడ్రోజన్ రైలు.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!

డీజిల్ ఖర్చు తగ్గించేందుకు రైల్వే కొత్త ప్లాన్.. ఫస్ట్ LNG రైలు వచ్చేసింది!

Big Stories

Advertisement
×