E-Paper
Advertisement

బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!

బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!
Advertisement

Passenger Urinates Inside Crowded Coach: రన్నింగ్ ట్రైన్ లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రద్దీగా ఉన్న రైలు బోగీలో ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేయడంపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, వీపు విమానం మోత మోగించారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

వైరల్ అవుతున్న వీడియోలో రైలు బోగీ ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి బోగీలోనే మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపించింది. సాధారణంగా రైళ్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ, అతడు బోగీలోనే అందరూ చూస్తుండగా ఇలా చేయడంతో తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, బోగీలో ఉన్న పలువురు ప్రయాణికులు ఆ వ్యక్తిని నిలదీశారు. టాయిలెట్ ఉన్నప్పటికీ ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మరికొంత మంది అతడి వీపు పగలగొట్టారు. దీంతో పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. అయితే, ఈ వాగ్వాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనకు ముందు ఏం జరిగిందనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.

సోషల్ మీడియాలో వైరల్

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో పెద్ద సంఖ్యలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. రైళ్లలో ప్రయాణించే సమయంలో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా కనీస పరిశుభ్రత, క్రమశిక్షణ పాటించాల్సిన అవసరంపై పలువురు కామెంట్లు చేస్తున్నారు.

రైల్వే అధికారుల దృష్టికి ఘటన!

ఈ వ్యవహారంపై రైల్వే అధికారులు మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన రైలు నంబర్, మార్గం, ఏ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది? మూత్రం పోసిన వ్యక్తి వివరాలు తెలుసుకుంటున్నారు. త్వరలోనే రైల్వే అధికారులు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైల్వే శాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడిన తర్వాతే సంఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

ఈ ఘటన మరోసారి ప్రజా రవాణాలో ప్రయాణికుల బాధ్యతపై చర్చకు దారితీసింది. రైలులో వేలాది మంది ప్రయాణించే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలనే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడైతేనే ఈ సంఘటనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Also: గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!

Tags

Related News

గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!

కొరియాలో పార్సిల్స్ టేప్స్ మీద పిల్లల ఫోటోస్ ఎందుకు ఉంటాయో తెలుసా? భలే ఐడియా!

నార్మల్ ప్యాసింజర్ లా వెళ్తూ.. రైలులో సివిక్ సెన్స్ లేని వాళ్లకి మొట్టికాయలు వేసిన ఆదా శర్మ!

కదిలే రైల్లో అదిరిపోయే కేఫే.. వేడి కాఫీ తాగుతూ వెళ్తుంటే ఆ కిక్కే వేరప్పా!

రాత్రివేళ లాంగ్ డ్రైవ్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

ప్రపంచంలో వింతైన రైళ్లు.. వీటి ప్రయాణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు.. ఈ 5 రూట్లు అస్సలు మిస్ కావొద్దు!

Big Stories

Advertisement
×