Indian Railway News: రైల్వే ప్రయాణంలో ప్యాసెంజర్లకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, అధికారులు నెక్ట్స్ రైల్వే స్టేషన్ లో వైద్యసాయం అందించడం ఇప్పటి వరకు చూశాం. కానీ, ఓ టీటీఈ సమయ స్ఫూర్తితో ఓ 70 ఏండ్ల ప్రయాణీకుడి ప్రాణాలను కాపాడారు. గుండెపోటుతో అల్లాడుతున్న వ్యక్తిని బెర్త్ మీద పడుకోబెట్టి సీపీఆర్ చేశాడు. నోటి ద్వారా శ్వాస అందించాడు. కాసేపటికి ప్రయాణీకుడి ఆరోగ్యం కుదుట పడింది. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. నెటిజన్లు టీటీఈపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందంటే?
తాజాగా రైలు నంబర్ 15708, ఆమ్రపాలి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ కోచ్ లో ప్రయాణిస్తున్న ఓ వృద్ధ ప్రయాణీకుడికి గుండెపోటు వచ్చింది. హార్ట్ ఎటాక్ తీవ్రతకు ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే ఈ విషయాన్ని తోటి ప్రయాణీకులు టీటీఈ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన మెడికల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడితో అగకుండా వెంటనే వచ్చి సదరు ప్రయాణీకుడికి సీపీఆర్ చేశారు. కాసేపటి తర్వాత నోటి ద్వారా శ్వాస అందించాడు. కొద్ది సేపట్లో సదరు ప్రయాణీకుడు నార్మల్ అయ్యాడు. శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాడు. క్రమంగా సాధారణ స్థితికి వచ్చాడు. తర్వాతి స్టేషన్ లో అతడిని దించి తదుపరి వైద్య సేవల కోసం హాస్పిటల్ కు తరలించారు.
టీటీఈ వీడియోను షేర్ చేసిన రైల్వేశాఖ
అటు గుండెపోటు వచ్చిన ప్రయాణీకుడికి సీపీఆర్ చేసిన టీటీఈ వీడియోను రైల్వేశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. “టీటీఈ సమయ స్ఫూర్తి ఓ ప్రాణాన్ని కాపాడింది. రైలు నంబర్ 15708 ‘ఆమ్రపాలి ఎక్స్ ప్రెస్’ జనరల్ కోచ్ లో ప్రయాణిస్తుండగా 70 ఏళ్ల ప్రయాణీకుడికి గుండెపోటు వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న టీటీఈ CPR చేసి ప్రాణాలు కాపాడారు. ప్రయాణీకుడిని ఛప్రా రైల్వే స్టేషన్ లో దింపి ఆసుపత్రికి పంపారు” రాసుకొచ్చింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: 8 కోచ్ ల స్ధానంలో 20 కోచ్ లు.. వందేభారత్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్
టీటీఈపై నెటిజన్ల ప్రశంసల జల్లు
ఈ వీడియో కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. టీటీఈ సమయ స్ఫూర్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “గ్రేట జాబ్. టీటీఈ ఓ నిండి ప్రాణాన్ని కాపాడారు. ఇలాంటి రైల్వే అధికారులు చాలా తక్కువగా ఉంటారు” అని ఓ నెటిజన్ కొనియాడారు. ‘టీటీఈకి నిజంగా సెల్యూట్” అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. “టీటీఈ వెంటనే స్పందించకపోయి ఉంటే, నిజంగా ఓ ప్రాణం పోయేది. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన టీటీఈని ప్రతి ఒక్కరూ అభినందించాలి” అని ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ టీటీఈని అభినందిస్తున్నారు.
Read Also: 25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?