BigTV English

Pahalgam terror attack: పహల్‌గామ్ ఉగ్ర దాడి.. అందుబాటులో 22 రైళ్లు

Pahalgam terror attack: పహల్‌గామ్ ఉగ్ర దాడి.. అందుబాటులో 22 రైళ్లు

Pahalgam terror attack: సమ్మర్ సీజన్‌ వచ్చిందంటే చాలు.. చాలామంది హిల్ స్టేషన్లకు వెళ్తుంటారు. ఈ సీజన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జమ్మూకాశ్మీర్‌కు ఎక్కువగా వెళ్తుంటారు పర్యాటకులు. అక్కడి అందాలను ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం కూడా. దేశంలోని నలుమూలల నుంచి టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు.


మంగళవారం మధ్యాహ్నం పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి 28 మంది మృత్యవాత పడ్డారు. బైసరన్‌ లోయలో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారి కాల్పులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో నిండిపోయింది. ఇప్పుడు అక్కడ నిశ్శబ్ధ వాతావరణం అలముకుంది.

ఈ ఘటన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు టెన్షన్ మొదలైంది. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర రైల్వే కీలక విషయాలు వెల్లడించింది. బారాముల్లా, శ్రీనగర్, బనిహాల్ వంటి కీలక స్టేషన్లను కలుపుతూ కాశ్మీర్ లోయలో 22 రైళ్లను భారతీయ రైల్వేలు నడుపుతోంది.


కాశ్మీర్‌లో తమవారు చిక్కుకుపోయారని బంధువులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది. అక్కడి నుంచి పర్యాటకులు బయలు దేరేందుకు బారాముల్లా, బుద్గాం, బనిహాల్, సంగల్డాన్ ఈ నాలుగు స్టేషన్ల నుంచి 22 రైళ్లు నడుస్తున్నట్లు వెల్లడించింది ఉత్తర రైల్వే విభాగం.

ALSO READ: వందే భారత్ రైళ్లకు ఆ గండం, ఇలాగైతే కష్టమే

రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

బారాముల్లా-సంగల్దాన్ మధ్య DMU రైలు నంబర్ 74620 బారాముల్లా నుండి మధ్యాహ్నం 2:40 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:55 గంటలకు సంగల్దాన్ చేరుతుంది.

బారాముల్లా-బుద్గాం DMU రైలు నంబర్ 74632 బారాముల్లా-బుద్గాం DMU మధ్యాహ్నం 15:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:40 గంటలకు బుద్గాంకు రానుంది.

బుద్గాం-బనిహాల్ DMU రైలు నంబర్ 74628 బుద్గాం నుండి సాయంత్రం 5:10 గంటలకు బయలుదేరి రాత్రి 7:20 గంటలకు బనిహాల్ రానుంది.

బారాముల్లా-బనిహాల్ DMU రైలు నంబర్ 74622 బారాముల్లా-బనిహాల్ DMU సాయంత్రం 5:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:05 గంటలకు బనిహాల్ చేరుకుంటుంది.

బారాముల్లా-బుద్గాం MEMU రైలు నంబర్ 74624 బారాముల్లా నుంచి సాయంత్రం 6:50 గంటలకు బయలుదేరి సాయంత్రం 7:55 గంటలకు బుద్గాం చేరుకుంటుంది.

రైలు నంబర్ 74616 బాద్గాం-బనిహాల్ డెము బుద్గాం నుండి ఉదయం 06:40 గంటలకు బయలుదేరి 08:30 గంటలకు బనిహాల్ చేరుకుంటుంది.

74626 బారాముల్లా-బనిహాల్ DMU రైలు బారాముల్లా నుండి ఉదయం 07:00 గంటలకు బయలుదేరి 10:00 గంటలకు బనిహాల్ చేరుకుంటుంది.

74614 బారాముల్లా-బనిహాల్ డెము బారాముల్లా నుండి ఉదయం 08:05 గంటలకు బయలుదేరి 11:30 గంటలకు బనిహాల్ చేరుతుంది.

64652 బారాముల్లా నుండి ఉదయం 9:20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:30 గంటలకు సంగల్డాన్ చేరుతుంది.

DMU రైలు నంబర్ 74618 బారాముల్లా నుండి ఉదయం 10:20 గంటలకు బయలుదేరి  11:10 గంటలకు బుద్గాం చేరుకుంటుంది.

74630 బారాముల్లా-బుద్గాం DMU బారాముల్లా నుండి ఉదయం 11:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:35 గంటలకు బుద్గాం చేరుకుంటుంది.

74631 బుద్గాం-బారాముల్లా DMU బుద్గాం నుండి 3:40 గంటలకు బయలుదేరి 4:50 గంటలకు బారాముల్లా రానుంది.

64651 సంగల్దాన్-బారాముల్లా మెము మధ్యాహ్నం 2:00 గంటలకు సంగల్దాన్ నుండి బయలుదేరి సాయంత్రం 6:10 గంటలకు బారాముల్లా చేరుకుంటుంది.

74617 బనిహాల్-బద్గాం డెము బనిహాల్ నుండి సాయంత్రం 5:10 గంటలకు బయలుదేరి సాయంత్రం 7:05 గంటలకు బుద్గాం చేరుకుంటుంది.

74621 బుద్గాం-బారాముల్లా DMU బుద్గాం నుండి 7:15 గంటలకు బయలుదేరి రాత్రి 20:10 గంటలకు బారాముల్లా చేరుకుంటుంది.

74629 బనిహాల్-బద్గాం డెము బనిహాల్ నుండి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:00 గంటలకు గమ్యస్థానం (బద్గాం) చేరుకుంటుంది.

74627 బుద్గాం-బారాముల్లా DMU బుద్గాం నుండి ఉదయం 06:45 గంటలకు బయలుదేరి ఉదయం 07:45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

74613 బుద్గాం-బారాముల్లా మెము బుద్గాం నుండి ఉదయం 8:05 గంటలకు బయలుదేరి ఉదయం 9:05 గంటలకు బారాముల్లా చేరుకుంటుంది.

74625 బనిహాల్-బారాముల్లా DMU బనిహాల్ నుండి ఉదయం 7:00 గంటలకు బయలుదేరి 10:10 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

74619 సంగల్దాన్-బారాముల్లా DMU ఉదయం 06:40 గంటలకు సంగల్దాన్ నుండి బయలుదేరి 11:20 గంటలకు గమ్యస్థానానికి రానుంది.

74623 బనిహాల్-బారాముల్లా DMU బనిహాల్ నుండి ఉదయం 9:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

74615 బనిహాల్-బారాముల్లా DMU బనిహాల్ నుండి ఉదయం 10:45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు గమ్యస్థానానికి రానుంది.

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×