Sankranti Festival Special Trains: సంక్రాంతి వేళ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు సూపర్ న్యూస్ చెప్పింది. తెలంగాణ నుంచి ఏపీకి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. వీటిలో పలు రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్ ను ప్రకటించింది. ఇంతకీ ఏ రైలు.. ఎప్పుడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ 07653 నెంబర్ గల కాచిగూడ-కాకినాడ టౌన్ కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 9, 11 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆయా తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటాయి. ఇదే రైలు(07654) ఈ నెల 10, 12 తేదీల్లో తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ రైళ్లు సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ టౌన్ లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటాయి.
ఈ నాలుగు రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
⦿ అటు 07023 నెంబర్ గల ప్రత్యేక రైలును ఈ నెల 10న హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ కు నడపనుంది. ఈ రైలు సాయంత్రి 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. అటు ఇదే రైలు(07024) ఈ నెల 11న తిరుగు ప్రయాణం అవుతుంది. రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: టికెట్లపై 75 శాతం డిస్కౌంట్.. విద్యార్థులకు రైల్వే సంస్థ స్పెషల్ రాయితీల గురించి తెలుసా?
విశాఖపట్నం వెళ్లే ప్రయాణీకుల ఆందోళన
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ వరకే నడపడం పట్ల ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం వరకు ఎందుకు రైళ్లు నడపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు రైళ్లను కాకినాడకే పరిమితం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైల్వే అధికారులు వెంటనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సంక్రాంతికి 172 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం 172 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. గత ఏడాది 70 రైళ్లను నడపగా ఈసారి ఆ సంఖ్యను డబుల్ చేసినట్లు వెల్లడించింది. అటు సాధారణ రైళ్లకు సైతం బోగీల సంఖ్య పెంచనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి స్టేషన్లలో రద్దీకి అనుగుణంగా రైళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
Read Also: సంక్రాంతికి మరో 60 స్పెషల్ రైళ్లు, సౌత్ సెట్రల్ రైల్వే గుడ్ న్యూస్!