BigTV English

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ దెబ్బకు ప్రభావతి హడల్.. బాలు కారు అమ్మేసిన విషయం తెలిసిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ దెబ్బకు ప్రభావతి హడల్.. బాలు కారు అమ్మేసిన విషయం తెలిసిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode May 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనసు ఇంటర్వ్యూ కి వెళ్లడానికి డబ్బులు కోసమని ప్రభావతిని వెతుక్కుంటూ వస్తాడు. ప్రభాస్ దగ్గరికి వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి అని అడుగుతాడు. డబ్బుల అదేంట్రా అని ప్రభావతి అంటుంది. లేదమ్మా ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలి.. అంటే నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావ్ కదరా మల్లి ఇంటర్వ్యూ కి ఎందుకు అని అడుగుతుంది. పాత జాబ్ ఏమైందిరా ఎప్పుడు వదిలేశావు దాన్ని.. అస్సలు నువ్వు మనిషివేనారా నిన్ను మానసిక వైద్యుడు దగ్గరికి తీసుకెళ్లాల్సింది అని ప్రభావతి చిందులేస్తుంది.. ఏ జాబ్ కూడా చేయలేవా నువ్వు ఎందుకు వదిలేసి వస్తున్నావని ప్రభావతి మనోజ్ పై అరుస్తుంది.ఇలా జాబు వదిలేసి పోతుంటే ఏ భార్య అయినా ఎలా కాపురం చేస్తుంది. రోహిణి మళ్ళీ వెళ్ళిపోయిందా అని అడుగుతుంది ప్రభావతి. జాబ్ పోయిన విషయం రోహిణి నీకు తెలుసమ్మా.. అవునా అయితే రోహిణి వెళ్ళిపోయిందా సరే మళ్లీ చెప్పు వెళ్ళిపోయిందా అని టెన్షన్ పడుతుంది. లేదమ్మా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి నేను ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను గొప్ప కంపెనీనే ఇది అని అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు అని ప్రభావతి అంటుంది. దొంగగా మారిన డబ్బులను కొట్టేసి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ ఇంటర్వ్యూ కి వెళ్తాడు ఇంటర్వ్యూ కి వెళ్తాడు. అక్కడ ఇంటర్వ్యూకి ఎక్కువ మంది వస్తే వాళ్ళందరితో మాటలు చెప్పి అందరిని బురిడీ కొట్టించి పంపించేస్తాడు. ఇక మనోజ్ ని ఇంటర్వ్యూ పిలుస్తారు. మనోజ్ క్వాలిఫికేషన్ చూసి అక్కడ ఉన్న ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంప్రెస్ అయిపోతాడు. అయితే కెనడాల ఉద్యోగం వచ్చిందని అతను చెప్తాడు. జీతము లక్షల్లో ఉంటుంది ఈ జాబ్ రావాలంటే ముందుగా మీరు మా కంపెనీకి 14 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్తారు. అది విన్న మనోజ్ షాక్ అవుతాడు. అయితే ప్రభావతి సత్యం అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. అయితే మనోజు ఇంటర్వ్యూ కి వెళ్లి తొందరగా వస్తాడని మీనాను అన్నం చేయమని చెప్తుంది. ఏంటి ఈ రోజు బాక్స్ తీసుకెళ్లలేదమ్మా రోహిణి అని సత్యం అడుగుతాడు. లేదు మామయ్య ఇంటర్వ్యూ కు వెళ్లాడు అని అంటుంది.

ఏంటి ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా పోయిందా వీడికి ఇంకా జాబ్ చేస్తే రాతలేదు అని సత్యం అనగానే..బాలు అదే కదా ఇది కూడా పోయింది అంటేనే కదా ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. ఏం సత్యావతి అబద్ధం చెప్తున్నావేంటి అని ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు. అప్పుడే మనోజు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఏమైందిరా ఇంటర్వ్యూ అంటే చెవులో చెప్తాడు. ప్రభావతి జాబ్ వచ్చేసిందని గొప్పలు చెప్పుకుంటూ అందరి మీద అరుస్తూ ఉంటుంది. పోనీలే నీకు తగ్గట్లు మంచి జాబ్ ఇన్నాళ్ళకైనా వచ్చింది కదా అని అందరూ అంటారు.


జాబ్ అయితే వచ్చింది కానీ 14 లక్షలు ముందుగా డిపాజిట్ చేయాలంట అప్పుడే కెనడాకు పంపిస్తారంట అని మనోజ్ అంటాడు. ఆ మాట వినగానే సత్యం 14 లక్షల ఎక్కడి నుంచి తేవాలి అని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం ఎలాగో తెస్తే వాడు సెటిలైపోతాడు కదా అనేసి అంటుంది. సత్యం నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడొద్దు ప్రభ వేలు కాదు వందలు కాదు లక్షలు అని అరుస్తాడు. ఇక మనోజ్ చేసేది ఏమీ లేక మరో జాబ్ వెతుక్కుంటాను అని చెప్తాడు. ఇదంతా విన్న బాలు ప్రభావతిపై ఒంటికాలుతో చిందులేస్తాడు…

అమ్మ కొడుకులు కలిసి ఎంత నాటకం ఆడుతున్నారు. ఈ లక్షల మింగినోడికి ఇక జాబే రాదు నేను చెప్పినట్లు ఏ డ్రైవర్ గాను ఏ క్లీనర్ కాకపోతే మంచిది అంటూ ఎటకారంగా మాట్లాడతాడు. మాకు అంత కర్ణ ఏం పట్టలేదని రోహిణి మాట్లాడుతుంది. నేను పార్లర్ గురించి మధ్యలో టాపిక్ రావడంతో బాలు అసలు నిజాన్ని చెప్పబోతుంటే సత్యం ఆపుతాడు. అసలు నిజమేంటి అని ప్రభావతి అంటుంది. చెప్తే నీ గుండె ఆగిపోతుంది అని బాలు అంటాడు. ఇదంతా ఎందుకు నాకు ఆకలేస్తుంది తినేసి ట్రిప్ ఉంది నేను వెళ్ళిపోతానని బాలు అంటాడు.

ప్రభావతి మాత్రం మనోజ్ దగ్గరకి వెళ్లి ఇన్ని రోజులు నీ టాలెంట్ దగ్గర జాబ్ రాలేదనుకున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా డబ్బులు కట్టాలి అంటే మాటలు కాదు అని అంటుంది.. అయితే రోహిణి దగ్గరికి వెళ్లిన ప్రభావతి మీ నాన్నని అడిగి 14 లక్షలు ఇప్పి అమ్మ వాడు కెనడాకు వెళితే నువ్వు కూడా అక్కడికి వెళ్లి సెటిలైపోవచ్చు కదా అనేసి అంటుంది. రోహిణి మరోసారి అడ్డంగా ఇరుక్కుంటుంది. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. మొత్తానికి ప్రభావతి దగ్గర నుంచి రోహిణి సేఫ్ గా బయటపడుతుంది.. ఒక టెన్షన్ నుంచి బయటపడ్డాను అని ఊపిరి పీల్చుకునే లోపల రోహిణికి మరో టెన్షన్ వచ్చి పడుతుంది. దినేష్ ఫోన్ చేసి డబ్బులు కావాలి లేదంటే డైరెక్ట్ గా మీ అత్తయ్య దగ్గరికి వచ్చి నిజాన్ని చెప్తానని అంటాడు.. రోహిణి భయపడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×