BigTV English

Rail Project in TG: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు, ఏకంగా రూ. 5 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

Rail Project in TG: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు, ఏకంగా రూ. 5 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

New Railway Projects: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం తెలంగాణపై వరాల జల్లు కురిపించింది. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో ప్రయాణీకులు, వస్తువుల సజావుగా, వేగవంతమైన రవాణా కోసం  రూ.12,328 కోట్ల పెట్టుబడితో నాలుగు రైల్వే ప్రాజెక్టులను ఆమోదించింది. వీటిలో దేశల్పర్ – హాజిపిర్ – లూనా, వాయోర్ – లఖ్‌ పత్ న్యూ లైన్, సికింద్రాబాద్ (సనత్‌నగర్) – వాడి 3వ, 4వ లైన్, భాగల్పూర్ – జమల్పూర్ 3వ లైన్, ఫుర్కేటింగ్ – న్యూ టిన్సుకియా డబ్లింగ్ ఉన్నాయి. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, బీహార్, అస్సాం అంతటా 13 జిల్లాలను కవర్ చేసే నాలుగు ప్రాజెక్టులు భారతీయ రైల్వే ప్రస్తుత నెట్‌వర్క్‌ ను 565 కి.మీ. పెంచనున్నయి.


తెలంగాణలో రూ. 5 కోట్ల విలువైన ప్రాజెక్టులు

కర్ణాటక, తెలంగాణ అంతటా విస్తరించి ఉన్న 173 కి.మీ పొడవైన సికింద్రాబాద్ (సనత్‌నగర్) – వాడి 3వ, 4వ లైన్‌ ను రూ.5,012 కోట్లతో నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనులు ఐదు సంవత్సరాల్లో పూర్తి కానున్నాయి. ఇక బీహార్‌ లోని 53 కి.మీ పొడవైన భాగల్పూర్ – జమాల్‌పూర్ 3వ లైన్‌ ను నిర్మించనున్నారు. రూ. 1,156 కోట్ల వ్యయంతో మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. 194 కి.మీ పొడవైన ఫుర్కేటింగ్ – న్యూ టిన్సుకియా డబ్లింగ్ పనులు, రూ. 3, 634 కోట్ల వ్యయంతో నాలుగు సంవత్సరాలలో పూర్తవుతాయని కేంద్రం ప్రకటించింది.


16 లక్షల మందికి ప్రయోజనం

ప్రతిపాదిత కొత్త లైన్ కచ్ ప్రాంతంలోని సుదూర ప్రాంతానికి కనెక్టివిటీని అందిస్తుంది. ఇది గుజరాత్‌లోని ప్రస్తుత రైల్వే నెట్‌ వర్క్‌ కు 145 రూట్ కి.మీ, 164 ట్రాక్ కి.మీలను జోడిస్తుంది. దీని అంచనా వ్యయం రూ. 2,526 కోట్లు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మూడు సంవత్సరాల సమయం పడుతుందని కేంద్రం తెలిపింది. గుజరాత్‌ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, కొత్త రైలు మార్గం ఉప్పు, సిమెంట్, బొగ్గు, క్లింకర్, బెంటోనైట్ రవాణాకు సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ రాన్ ఆఫ్ కచ్‌కు కనెక్టివిటీని అందిస్తుంది. హరప్పా సైట్ ధోలావీర, కోటేశ్వర్ ఆలయం, నారాయణ్ సరోవర్, లఖ్‌ పత్ కోట కూడా ఈ రైల్వే నెట్‌ వర్క్ పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే, 13 కొత్త రైల్వే స్టేషన్లు యాడ్ కానున్నాయి. వీటి ద్వారా 866 గ్రామాలు, 16 లక్షల జనాభాకు ప్రయోజనం చేకూరనుంది.

Read Also: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు డైవర్ట్, కారణం ఏంటంటే?

3,108 గ్రామాలకు కనెక్టివిటీ

ప్రధాన కనెక్టివిటీ పెంపులోఆమోదించబడిన మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సుమారు 3,108 గ్రామాలు,  దాదాపు 47.34 లక్షల జనాభాకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఇది కర్ణాటక, తెలంగాణ, బీహార్, అస్సాం రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణాను గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా భారతీయ రైల్వేలకు మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, సేవా విశ్వసనీయత మెరుగుపడుతుంది. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, రద్దీని తగ్గించడానికి ఉపయోగపడనున్నాయి.

Read Also: అక్టోబర్ నాటికి సీప్లేన్ సేవలు.. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!

Related News

Secunderabad trains: మళ్లీ రద్దీగా మారనున్న సికింద్రాబాద్ స్టేషన్.. ఆ రైళ్లు మళ్లీ వచ్చేస్తున్నాయ్!

Manwal station: హోటల్ అనుకోవద్దు.. ఇదొక రైల్వే స్టేషన్.. దీని వెనుక పెద్ద కథే ఉంది!

Visakhapatnam updates: విశాఖ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్ లో వందే భారత్ ట్రైన్.. గంటల జర్నీకి ఇక సెలవు!

Artificial Beach: హైదరాబాద్ కు బీచ్ వచ్చేసింది, ఇక ఎంజాయే ఎంజాయ్!

Top 5 Malls in Hyderabad: హైదరాబాద్ లో టాప్ 5 మాల్స్, ఏడాదంతా డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Big Stories

×