BigTV English

Kumbh Mela 2025 Trains: మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం 36 ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం

Kumbh Mela 2025 Trains: మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం 36  ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం

RSouth Central Railway Kumbh Mela 2025 Trains: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో  ఆధ్యాత్మిక సంబురం మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతున్నది. జనవరి 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నాయి. సుమారు 45 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలో పాల్గొనేందుకు.. ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు. సుమారు 45 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ఏకంగా 7,500 కోట్లతో  భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నాగసాధువులు, అఘోరాలు, సాధువులు, సంతులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 5 రోజుల్లోనే సుమారు 8 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తున్నది. కోట్లాది మంది గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులవుతున్నారు.


మహా కుంభమేళా కోసం దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు

ఈ మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశ నలుమూలల నుంచి ఏకంగా 13 వేల రైళ్లను కేటాయించింది. వీటిలో 10 వేలు రెగ్యులర్‌ సర్వీసులు కాగా.. 3 వేలు ప్రత్యేక రైళ్లు. మహా కుంభమేళా జరగడానికి రెండు, మూడు రోజుల ముందు.. ఆ తర్వాత రెండు, మూడు రోజుల వరకు ఈ రైళ్లు నడుస్తాయి. అటు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ 560 రింగ్‌ రైళ్లను నడుపుతున్నది రైల్వేశాఖ. మరోవైపు ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ లో భక్తులకు అవసరమైన సమాచారం ఇవ్వడంతో పాటు టికెట్లు  అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులుకు అర్థం అయ్యేలా ఏకంగా 15 ప్రాంతీయ భాషల్లో అనౌన్స్ మెంట్స్ ఇస్తున్నారు.


మహా కుంభమేళా కోసం 36 రైళ్లు కేటాయించిన సౌత్ సెంట్రల్ రైల్వే

అటు మహా కుంభమేళాకు వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను కేటాయించగా, తాజాగా మరో 36 రైళ్లను కేటాయించినట్లు తెలిపింది. జనవరి 16 నుంచి మార్చి 31 వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వారీగా రైళ్ల వివరాలను వెల్లడించింది. ఈ రైళ్లన్నీ సికింద్రాబాద్, కాచిగూడ నుంచి బయల్దేరనున్నట్లు తెలిపింది. ఆయా నెలల వారీగా వెళ్లే రైళ్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జనవరిలో మహా కుంభమేళాకు వెళ్లే రైళ్లు..

Read Also: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై తేజస్, వందే భారత్ రైళ్లలోనూ ఆ సౌకర్యం!

Read Also: ఆ రూట్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ 50 రోజులు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?

ఫిబ్రవరిలో మహా కుంభమేళాకు వెళ్లే రైళ్లు

Read Also: నిమిషానికి 2.5 లక్షల టిక్కెట్ల జారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!

మార్చిలో మహా కుంభమేళాకు వెళ్లే రైళ్లు

Read Also: ముగిసిన సంక్రాంతి సంబురాలు.. విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×