Gundeninda GudiGantalu Today episode October 3rd : నువ్వు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు కాబట్టే నీతో నీకోసం సర్ప్రైజ్ మనీ గిఫ్ట్ కూడా ఇచ్చింది. మేము రింగు కొన్నామని శృతి చెప్పగానే ప్రభావతి ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అసలు మీరు రెస్టారెంట్ కి అది ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. ఐదు లక్షలు తీసుకురావడానికి కారణం వీళ్ళే కాబట్టి వాళ్ల కోసం నేను స్వీట్ పెట్టాలని అక్కడికి వెళ్లాను అని చెప్పగానే బాలు ఇప్పుడు ఈ ప్రభావతి కలలో నిప్పులు పెరుగుతున్నాయి అని సెటైర్ల వర్షం కురిపిస్తాడు. మొత్తానికి మీనా సాధించింది అని అందరూ హ్యాపీగా ఉంటే ప్రభావతి మాత్రం షాక్ లో ఉండిపోతుంది. దీనికి రోజురోజుకీ క్రేజీ పెరిగిపోతుంది అంటూ అనుకుంటుంది.
అందరూ చాలా సంతోషంగా ఉన్నారని పైకి వెళ్లి సిట్టింగ్ వేస్తారు అయితే మన రాగానే నీ భార్యను దూరం అవుతున్నావు వెంటనే దగ్గర ఈ ప్రయత్నం చేసుకుని బాలు రవి అంటారు. బాలు రవి మాటతో మనోజ్ అమ్మ దగ్గరికి వెళ్లాలంటేనే నాకు భయమేస్తుంది. అలాంటిది ఇక రోహిణి గురించి మాట్లాడితే కళ్ళల్లో నిప్పులు గుండం తెలుస్తుంది అని భయంగా ఉంది అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కింద ఆడవాళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ రోహిణి పై శృతి కౌంటర్ల వర్షం కురిపిస్తుంది. ప్రభావతీ రాత్రికి కలగంటుంది రోహిణి మనోజ్ కలిసిపోయారని.. ఇక వాళ్ళ గది దగ్గరికి వెళ్లి విజిల్ ఊదుతూ ఎలాగైనా సరే వాళ్ళని దూరం చేయాలని అనుకుంటుంది. అయితే మనోజ్ ఎంత సేపటికి రాకపోవడంతో వీళ్ళు లోపలేదో జరుగుతున్నట్టు ఉంది. కచ్చితంగా వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే విడగొట్టాలి అని ఇంకాస్త గట్టిగా విజిల్. మనోజ్ రాగానే తలుపు వేయద్దని నీకు చెప్పాను కదా.. మళ్ళీ ఎందుకు తలుపు వేసి దాంతో సరసాలు ఆడుతున్నావా అంటూ ప్రభావతి తిడుతుంది.
తన కొడుకుని తన వైపు తిప్పుకునేందుకు ప్రభావతి చేస్తున్న క్లాన్లు రోహిణి తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు ఎవరైనా కొడుకు కాపురం సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈవిడ మాత్రం కొడుకుని కోడల్ని కలవనివ్వకుండా చేస్తుంది అంటూ రోహిణి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది.. అసలు ఎలాగైనా సరే మన స్నేహితుడి నుంచి దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. కామాక్షి పిన్నికి చెప్పి ప్రభావతి మనసులో నా మీద మంచి స్థానాన్ని ఏర్పడేలా చేయాలి అని అనుకుంటుంది. అయినా చెప్పినట్లు చేస్తే అంతా మంచే జరుగుతుంది అని రోహిణి అనుకుంటుంది.
రోహిణి కామాక్షి దగ్గరికి వెళ్లి కలిసి నిజం చెప్పాలి అని అనుకుంటుంది. అయితే కామాక్షి రోహిణి నేను చూడగానే ఏంటి నువ్వా ఏం మోసం చేయాలని మళ్లీ వచ్చావు అని వెటకారంగా మాట్లాడుతుంది. నేను తప్పులే చేశాను కానీ మనోజ్ మీద ప్రేమతోనే చేశాను ఎవరిని మోసం చేయలేదు అని రోహిణి చెప్పగానే.. నిన్ను పరిచయం చేసినందుకు మీ అత్త నామీద ఎగిరి కూర్చుంది ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే నన్ను చంపేస్తుంది అని కామాక్షి అంటున్న సరే రోహిణి మాత్రం నేను చెప్పేది ఒకసారి వినండి పిన్ని అని బ్రతిమలాడుతుంది. సరే అమ్మ లోపలికి రా లేకుంటే బయట మీ అత్తయ్య గనుక చూసిందనుకో నేను నీకు ట్రైనింగ్ ఇచ్చి అన్ని నేర్పిస్తున్నానని నా మీద పడి ఏడుస్తుంది అంటూ కామాక్షి తలపేసి రోహిణి నేను లోపలికి తీసుకొని వెళ్తుంది.
ప్రభావతి సడన్ గా ఎంట్రీ ఇవ్వడంతో అటు రోహిణి ఇటు కామాక్షి ఒక్కసారిగా కంగారు పడిపోతుంటారు. ఏంటి వదిన చడి చప్పుడు లేకుండా వచ్చేసావు అని కామాక్షి అడుగుతుంది సరేగాని ముందు ఆటో వాడికి రూ. 50 ఇవ్వు నా దగ్గర చిల్లర లేవు అని కామాక్షి అంటుంది. ఎప్పుడు లెండి సడన్గా ప్రభావతి కామాక్షి ప్రవర్తన చూసి అనుమాన పడుతుంది. బెడ్రూంలో ఏమంత దాచిపెట్టింది. అంత సీక్రెట్ గా వెళ్లి డబ్బులు తీసుకుని వస్తుంది అని అనుకుంటుంది. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా.. వదినా బెడ్రూంలో వేసి వేసుకుని కూర్చుందాం పద అనేసి ప్రభావతి అడుగుతుంది. బెడ్రూంలో ఏసీ పనిచేయట్లేదు వదిన పాత ఏసి కదా అని కామాక్షి మేనేజ్ చేస్తుంది అయితే మనోజ్ని రోహిణి విడగొట్టేందుకు ప్రభావతి ఒక ప్లాన్ చేస్తుంది.. అది కామాక్షికి చెప్తుంది రోహిణి అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..