E-Paper
Advertisement

ఫెర్నాండో క్యాచ్ పై వివాదం…DRS లేక‌పోవ‌డమే కొంప‌ముంచిందంటూ ట్రోల్స్

ఫెర్నాండో క్యాచ్ పై వివాదం…DRS లేక‌పోవ‌డమే కొంప‌ముంచిందంటూ ట్రోల్స్
Advertisement

Nuwanidu Fernando Catch Controversy:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా కాంస్య మెడల్ కోసం బంగ్లాదేశ్, శ్రీలంక తలపడ్డాయి. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన శ్రీలంక 63 పరుగుల తేడాతో విజయం సాధించి… కాంస్యం అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు నువనిందు ఫెర్నాండో వివాదాస్పదంగా అవుట్ అయ్యాడు. బ్యాట్ కు బంతి తగలకున్నా, ఫెర్నాడోను అవుట్ గా ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. దీంతో ఈ వికెట్ వివాదంగా మారింది. అయితే జపాన్ లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో డిసిషన్ రివ్యూ సిస్టం ( DRS ) లేకపోవడంతో ఫెర్నాండో బలి అయ్యాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఫెర్నాండో క్యాచ్ పై వివాదం…DRS లేక‌పోవ‌డమే కొంప‌ముంచిందంటూ ట్రోల్స్

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంటు కాంస్య పతకం కోసం ఇవాళ బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. కోరంగి స్పోర్ట్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ఆటగాడు ఫెర్నాడో అయిన విధానం వివాదంగా మారింది. బంగ్లాదేశ్ బౌలర్ అల్ ఇస్లాం అదిరిపోయే బంతికి ఫెర్నాండో టెంప్ట్ అయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ లిటన్ దాస్ క్యాచ్ అందుకోవడంతో… సంబరాలు చేసుకున్నారు. అయితే ఫీల్డ్ ఎంపైర్ కూడా వెంటనే అవుట్ ఇచ్చేశాడు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

దీంతో ఫెర్నాండో పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే రీప్లేలో మాత్రం బ్యాట్ కు బంతి తగలనట్లు స్పష్టంగా కనిపించింది. అయితే ఏషియన్ గేమ్స్ లో కొన్ని టెక్నికల్ కారణంగాల వల్ల DRS వ్యవస్థను అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేసి ఉంటే ఫెర్నాడో కచ్చితంగా రివ్యూ తీసుకునేవాడు. DRS లేకపోవడంతో అతడు వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. జపాన్ అద్భుతంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో… డిసిషన్ రివ్యూ సిస్టం లేకపోవడంపై మండిపడుతున్నారు.

కాంస్యం గెలిచిన శ్రీలంక

Advertisement

బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో శ్రీలంక అద్భుతమైన విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 165 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించే క్రమంలో విఫలమైంది. 102 పరుగులకే కుప్ప కూలింది. దీంతో 63 పరుగులు తేడాతో విజయం సాధించిన శ్రీలంక… కాంస్యం అందుకుంది. ఇక మరో మ్యాచ్ ఫైనల్స్ జరుగుతోంది. ఇందులో పాకిస్తాన్, టీమిండియా జట్లు తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన జట్టుకు గోల్డ్ మెడల్ దక్కనుంది.  ఇప్పటికే ఈ మ్యాచ్ షురూ కాగా, టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది.

 

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

 

 

Related News

పాక్ మ్యాచ్‌లో వైభవ్ ఔట్…జోల పాట పాడిన సైమ్ అయూబ్

మిస్టర్ గిల్…నీ డబుల్ సెంచరీలను చెత్తబుట్టలో వేసుకో!

మళ్లీ బరువు పెరుగుతున్న రోహిత్ శర్మ? సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్

కావ్య పాపకు షాక్.. SRH ను వదిలేస్తున్న అభిషేక్ శర్మ?

టీమిండియా మాకు వెంట్రుకతో సమానం..ప్రపంచంలో ఎవరినైనా పాకిస్తాన్ ఓడిస్తుంది

వ‌ర్షం ప‌డేలా అల్లాను ప్రార్థించండి…లేక‌పోతే పాకిస్తాన్ తుక్కు తుక్కుగా ఓడిపోతుంది

ఫైన‌ల్స్ లో అదే జ‌రిగితే…పాకిస్తాన్ గ‌ల్లీల్లో టీమిండియా దిష్టి బొమ్మ త‌గ‌ల‌బెడ‌తా !

Big Stories

Advertisement
×