Train Ticket: రైల్వే లో మీరు ఎక్కువగా తిరుగుతుంటారా..? దేశంలో వివిధ ప్రాంతాలకు తరుచుగా ప్రయాణం చేస్తుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి మీకు రైల్వే బెర్తు కన్ఫం కాలేదా..? తత్కాల్ లో కూడా టికెట్ దొరకలేదా..? ప్రతి సారి టికెట్ తీసుకోవడం విసుగ్గా అనిపిస్తుందా..? అయితే మీ లాంటి వాళ్ల కోసమే భారతీయ రైల్వే సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి సేవను మీరు ఎక్కడా చూసి ఉండరు.
భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అలా ఇప్పటి వరకు చాలా రకాల సేవలను తీసుకొచ్చిన రైల్వే సంస్థ విజయవంతంగా ప్రయాణికులకు అందిస్తోంది. పండగ సీజన్‌లో ప్రత్యేక రైళ్లను నడపడం, వస్తువులను పార్శిల్ రూపంలో తరలించడం, ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్, ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ఫ్‌లైన్ నెంబర్స్, సీనియర్ సిటిజన్స్ కు టికెట్లలో రాయితీ కల్పించడం లాంటి ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చిన ఇండియన్ రైల్వేస్.. సర్క్యులర్ జర్నీ టికెట్ అనే వినూత్నమైన సేవను ప్రయాణికులకు కల్పించింది. ఈ టికెట్ తీసుకుంటే మీరు ఏకంగా 56 రోజుల పాటు మరే టికెట్ తీసుకోకుండా ట్రెయిన్ లో ప్రయాణించవచ్చు. దీంతో మీకు ప్రతిసారి టికెట్ తీసుకునే ప్రయాస తప్పడమే కాకుండా… బెర్తు కన్ఫం కాదేమోననే భయం ఉండదు. అయితే ఈ టికెట్ తీసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.
సర్క్యులర్ జర్నీ టికెట్ అంటే ఏమిటి:
మీరు పుణ్యక్షేత్రాలకు కానీ విహార యాత్రలకు కానీ వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ తగ్గట్టు మీరు ట్రెయిన్ లో జర్నీ చేయడానికి అనువుగా ఇచ్చేదే ఈ సర్క్యులర్ జర్నీ టికెట్. అయితే ఈ టికెట్ తీసుకునే ముందు మీరు ప్రయాణం చేయడానికి ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఆ తర్వాత మీరు తిరగాల్సిన స్టేషన్లు ముందే తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్ తీసుకున్నాక మిగతా స్టేషన్లలో మీరు ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ టికెట్ తీసుకోవాలనుకుంటే రైల్వే డివిజనల్ ఆఫీసులో సంప్రదించాలి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
మీరు ప్రయాణం మొదలు పెట్టే తేదీని, స్టేషన్‌ను, మీరు వెళ్లాల్సిన గమ్య స్థానాన్ని క్లియర్ గా తెలియజేయాలి. ఒక్కసారి టికెట్ తీసుకున్నాక ఇక మీ జర్నీ మొదలైనట్టే ఆ టికెట్ తీసుకున్న రోజు నుంచి 56 రోజుల పాటు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలనుకుంటే.. మధ్యలో తిరుపతిలో దిగి అక్కడ దర్శనం చేసుకున్నాక. మళ్లీ అక్కడి నుంచి అరుణాచలం వెళ్లాలనుకుంటే ఆ ముందు రోజు తిరుపతి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అధికారులను సంప్రదించి మరుసటి రోజుకు బెర్తును కన్ఫం చేసుకోవాలి.
అలా మీరు ఎక్కిన స్టేషన్ నుంచి మొత్తం 8 స్టేషన్లకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. మీరు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లి వస్తే మధ్యలో ఇంకో నాలుగు స్టేషన్లలో మాత్రమే ఎక్కి దిగే వెసులుబాటు ఉంటుంది. ఒక స్టేషన్‌లో దిగిన తర్వాత ఆ ప్రాంతంలో మీరు ( టికెట్ వ్యాలిడిటి 56 రోజుల్లో) ఎన్ని రోజులైనా ఉండొచ్చు.
సర్క్యులర్ జర్నీ టికెట్ ధరలు:
సర్క్యులర్ జర్నీ టికెట్ ధరలు అనేవి ప్రయాణంలో వివిధ దశలకు ఉన్న చార్జీలను బట్టి మారుతుంటాయి. అయితే మామూలు టికెట్ రేట్ కన్నా తక్కువగా ఉంటాయి. అదనపు ఖర్చులు ఉండవు. ఈ టికెట్లను ఏసీ బెర్తులలోని మూడు క్లాసులకు, స్లీపర్ క్లాసుకు తీసుకోవచ్చు. ఆయా క్లాసులను బట్టి టికెట్ రేటులో మార్పులు ఉంటాయి. అయితే ఇందులో కూడా సీనియర్ సిటిజన్స్‌కు రాయితీలు ఇస్తుంది రైల్వే శాఖ.
ALSO READ: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?